రాష్ట్రీయం

నోట్ల మార్పిడి అక్రమాలపై కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రద్దయిన నోట్ల మార్పిడి అక్రమాలపై సిబిఐ దూకుడు పెంచింది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ పోస్ట్ఫాసులో రూ. 65 లక్షల మేర అక్రమాలు జరిగినట్టు సిబిఐ గుర్తించింది. ఈ బ్రాంచిలో పనిచేస్తున్న ఎనిమిది మందిపై సిబిఐ రెండేసి కేసులు నమోదు చేసింది. అదేవిధంగా కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె పోస్ట్ఫాస్‌లో రూ. 34 లక్షలు గోల్‌మాల్ జరిగినట్టు సిబిఐ గుర్తించింది. అక్కడ పనిచేస్తున్న సబ్ పోస్టుమాస్టర్‌పై కేసు నమోదైంది. సదరు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ సిబిఐ ఆయా ప్రభుత్వాలకు నివేదిక పంపింది. ఈ అక్రమాల్లో ఇంకా కొంత మంది సిబ్బంది ప్రమేయముందన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్టు సిబిఐ పేర్కొంది.