డైలీ సీరియల్

బడబాగ్ని-44

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమారు పావు గంటకి అన్నట్టుగానే ఆ గదిలోకి వచ్చేడు భగవాన్..
ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంటూ అడిగాడు ఆయన, ‘‘నేను మీకు ఏం చెయ్యగలను’’ అని.. ఆయన యిప్పుడు మామూలుగా ఉన్నాడు.
‘‘సర్.. నేను ఈ కేసులు గొడవలూ నాకెందుకు అనీ, మా అమ్మగారి మాట మీద ఇక్కడి ఉద్యోగం, గొడవలూ అన్నీ వదిలేసి మా ఊరు వెళ్లిపోయాను. బట్ నా మనస్సాక్షి నన్ను నిలవనియ్యడంలేదు. కళ్ళ ఎదుట జరిగిన ఘోరాల్ని నాకెందుకు అని వదిలేసి, పట్టనట్టు వెళ్లిపోవడానికి నా అంతరాత్మ ఒప్పడంలేదు. అదీకాక నాకెంతో ప్రియమైన మిత్రుడు కమల్ దుర్మణం వెనకాల ఏదో కుట్ర ఉందనే నా నమ్మకం.. చేదోడు వాదోడుగా వుండే స్నేహితుడిని పోగొట్టుకుని, కాస్తో కూస్తో ఉత్సుకత చూపే అనే్వష్ ఉద్యోగం పేరిట వెళ్లిపోయాడు.
నేను బొత్తిగా ఒంటరినయిపోయాను.. మీకు అభ్యంతరం లేకపోతే నాకు మీ సహాయ సహకారాలు కావాలి. ఎంతైనా మీరు అనుభవజ్ఞులు.. మీ అనుభవం, ఒక కేస్ స్టడీ చేసి సాల్వ్ చేసే విధానం తప్పకుండా మార్గదర్శకంగా ఉంటాయి.. కాబట్టి ఈ కేసులో నేను మీ సహాయ సహకారాలు కోరుకుంటున్నాను.. మీ ఫీజ్ ఎంతో చెబితే నేను ఇచ్చుకుంటాను...’’
భగవాన్ మాట్లాడకుండా రాహుల్నే చూస్తున్నాడు. ఇతను నిజంగానే నా సాయం కోరి వచ్చాడా, ఇందులో ఏదైనా మతలబు ఉందా అని ఆలోచిస్తున్నాడు.
‘‘సర్.. మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు.. ఇతను ఈ విషయమై నా దగ్గరకే ఎందుకొచ్చాడు అని.. నిజమే మీకా సందేహం రావడం సమంజసమే.. కానీ నిజంగా ఇందులో ఏమీ తిరకాసు లేదు. నేను ఈ కేస్ వదిలెయ్యలేకపోతున్నా, అలా అని ఒక్కడినీ చెయ్యలేను, మిమ్మల్నే ఎందుకడుగుతున్నానంటే, మీరు చాలా పెద్ద లీడింగ్ క్రిమినల్ లాయర్, యింకా ముఖ్యంగా కొంతవరకూ ఈ కేసు పూర్వాపరాలు మీకు తెలుసు. అందుకే మీ దగ్గరికి వచ్చా..’’ ఒక్కొక్క మాటా చాలా జాగ్రత్తగా ఆచి తూచి అన్నాడు రాహుల్.
లాయర్ భగవాన్ మనసులోనే చాలా సంతోషించేడు.. అతనిని అలా పెద్దరికం యిచ్చి గౌరవించడంతో ఆయన ఈగో తృప్తిపడింది. ఆయనకి ముందే రాహుల్‌మీద మంచి అభిప్రాయమే ఉంది. కాకపోతే కొంచెం రెక్లెస్‌గా, రఫ్‌గా ఉంటాడనీ, పెద్దవాడనే వినయం తన దగ్గర చూపలేదనే దానితోబాటు అతని తెలివితేటలూ, చురుకుదనం ఆయనలో కొంచెం అసూయ రగిల్చాయి.. యిప్పుడు తనంత తానుగా వచ్చి ఆయన సహాయం అడగడంతోబాటు, ఆయన అనుభవానికీ, దక్షతకూ పెద్ద పీట వెయ్యడంతో ఆయన అహం చల్లారింది.
‘‘వెల్ మై బోయ్.. నీలాంటి యువకులతో కలిసి పని చేయడం నాకూ ఆనందమే... మనం ఈ ఆపరేషన్ వచ్చే సోమవారం నుండి మొదలు పెడదాం.. ఎందుకంటే నేను ఆల్రెడీ టేకప్ చేసిన కేసులు ఈ వారంతో ఫైనల్ హియరింగ్ అయిపోతాయి.. ఈలోగా నువ్వు ఏదైనా స్టడీ చేస్తే చెయ్యి, బట్ ఒక విషయం గుర్తుపెట్టుకో.. ఈ కేసులో వున్న హంతకుడు సామాన్యుడు కాదు. ఎందుకంటే ఐపిఎస్ ట్రైనింగ్ సెంటర్‌లో, వాళ్ళ వాడి చేత వాళ్ళ మనిషిని హత్య చేయించినవాడు సామాన్యుడు ఎలా అవుతాడు.. నాకు తెలిసీ మీ స్నేహితుడు కమల్‌ది కూడా ఏక్సిడెంటల్ డెత్ కాదు, అలా అనిపించే మర్డర్.. సో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడికి ఏ మాత్రం అనుమానం వచ్చినా నీ పని ఆఖరు.. అవునూ నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయావని చెప్పాడు అనే్వష్.. మరి మళ్లీ యిప్పుడు ఎక్కడ ఉంటావ్..’’
అందుకే ఆయన అంత పెద్ద లీడింగ్ లాయర్ అయ్యాడు.. మొత్తం సారం యింకా కేసులో లోతుపాతులు చూడకుండానే చెప్పేశాడు.. రాహుల్‌కి ఆయనమీద గురి కుదిరింది.
‘‘ఏమిటీ ఆలోచిస్తున్నావ్.. ఎక్కడ ఉండాలా అనా..’’
‘‘అదే సర్’’ ఆలోచనలలోంచి తేరుకుంటూ చెప్పేశాడు..’’
‘‘పోనీ ఒక పని చెయ్.. నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లోనే ఔట్ హౌస్ ఖాళీ ఉంది. ఈ కేసు సాల్వ్ అయ్యేదాకా ఉండు.. భయపడకు.. మా అమ్మాయికి పెళ్లి అయి అమెరికాలో వుంది. నిన్ను ఫ్రీగా అల్లుడు చేసుకునే ఉద్దేశ్యంతో ఉండమనలేదు.. ఇంతకూ పెళ్ళయిందా..’’ భళ్లు నవ్వేశాడాయన.
‘‘లేదు సర్.. సరే నా సూట్‌కేసు హోటల్లో ఉంది.. తీసుకుని వస్తాను.. అదే మంచిది ఈ కేసు అయ్యేదాకా ఇక్కడే ఉంటే, భద్రతకి భద్రం.. మనం కేసు స్టేడీ చేయడానికి వెసులుబాటు..’’ వెంటనే ఒప్పేసుకున్నాడతను.
అవును సార్, మీరు పుట్టి పెరిగింది, చదివింది అన్నీ యిక్కడే అని విన్నానూ.. మీరేమిటి తెలుగు ఇంత అనర్గళంగా, చక్కగా మాట్లాడుతున్నారు.. పైగా కోర్టులో కూడా చాలా మటుక్కి తెలుగే వాడేరు.. మీరు ఆంధ్రా వాళ్ళా’’ తన సందేహం తీర్చుకుందుకు అడిగాడు రాహుల్.
‘‘అవునయ్యా.. మా తాత ముత్తాతలు అక్కడివారే.. మా నాన్నగారు రైల్వే ఉద్యోగిగా యిక్కడే ఎక్కువ కాలం పనిచేశారు.
-ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్