ఆంధ్రప్రదేశ్‌

విదేశీ కంపెనీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతపై లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 2: మిర్చి రైతుల సమస్యలపై జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ స్పందించారు. రాజధానిలో బలవంతపు భూ సేకరణను వ్యతిరేకించిన ఆయన రైతాంగ సమస్యలపై ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ మంగళవారం ట్విట్టర్‌లో పదునైన వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడుల కోసమంటూ విదేశీ కార్పొరేట్ కంపెనీలపై చూపించే శ్రద్ధ దేశానికి అన్నంపెట్టే రైతులపై చూపకపోవటం వల్లే రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు దాపురించాయని పరోక్షంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరును వ్యతిరేకించారు. ఇందుకు ఉదాహరణే తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతుల ఆందోళన అన్నారు. ఆరుగాలం కష్టించి పండించే రైతు కన్నీరు పెట్టడం దేశానికి శ్రేయస్కరం కాదన్నారు. సీజన్‌లో మిర్చి విస్తీర్ణం ఎంత వేయాలో రైతులకు ముందుగా సూచించటంలో వ్యవసాయశాఖ విఫలమైందని విమర్శించారు. పండిన పంటకు గిట్టుబాటు ధర లభించకుండా చేయటం మార్కెటింగ్‌శాఖ తప్పిదమవుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు రైతుల సమస్యలను చిన్నచూపు చూడకుండా క్రియాశీలంగా పనిచేయాలని కోరారు. గత ఏడాది మిర్చికి 13వేల 500 ధర పలికిందని, ప్రస్తుతం 11వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మార్కెట్ లో ధరకు, గిట్టుబాటుధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.