2న అంధగాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌తరుణ్, హెబ్బాపటేల్ జంటగా ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రై. లి. పతాకంపై వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర రూపొందించిన చిత్రం ‘అంధగాడు’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- వైవిధ్యమైన కథతో రూపొందించిన ఈ సినిమా రాజ్‌తరుణ్‌కు హ్యాట్రిక్ చిత్రంగా నిలుస్తుందని, దెబ్బకు పోయే పోయే అనే పాట టీజర్‌ను ఇటీవల విడుదల చేశామని, దానికి మంచి స్పందన లభించిందని తెలిపారు. త్వరలో థియేటర్ ట్రైలర్‌ను విడుదల చేసి ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించి 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు. లవ్, కామెడీ, యాక్షన్, సస్పెన్స్‌తో సహా అన్ని ఎలిమెంట్స్ చిత్రంలో ఉన్నాయని, ఓ కీలకమైన అంశం చుట్టూ సాగే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని వారు తెలిపారు. ఆశీష్ విద్యార్థి, రాజా రవీందర్, షాయాజీ షిండే, సత్య తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.