పర్యాటకం

లింగాకృతిలో కొలువైన సుబ్రహ్మణ్యస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ తుర్ముఖుడు చెప్పిన శుభవార్తను విన్న దేవతలంతా సంతోషించారు. త్వరలో ఆదిదంపతులు, పార్వతీపరమేశ్వరులు శివకుమారుని ప్రసాదిస్తారని ఎంతో ఆనందించారు. ఆ శివకుమారుని వల్లే తారకుని పీడ వదులబోతోందని సర్వజనావళి ఆతృత పడ్డారు. ఏకాంత కేళీవిహారంలో ఉన్న పార్వతీపరమేశ్వరులు ఎంతకీ కుమారోదయం గురించి చెప్పకపోయేసరికి దేవతలు ఆందోళనకు గురయ్యారు. దాంతో దేవతలంతా కలసి శివదర్శనానికి వెళ్లారు. శివకుమారుని గురించి తమ ఆందోళనను తెలిపారు. శివుడు మీకోరిక త్వరలో నెరవేరుతుందని వారికి అభయం ఇచ్చాడు.
కొన్నాళ్లకు రేతవనంలో కుమారోదయం జరిగింది. ఆ కుమారునికి కృత్తికలు పాలివ్వడంతో శివకుమారుని కార్తికేయుడన్న నామంతో పిలిచారు. ఆరుమొగాలతో పాలుకుడిచిన వైనాన్ని చూచిన దేవతలు షణ్ముఖుడని కీర్తించారు. శివకుమారుడు తారకాసుర భంజనం చేయాలని ఇంద్రుడు తన తనయయైన దేవసేనను నిచ్చి పెండ్లిచేశాడు. దేవసేనను తీసుకొని శివకుమారుడు తారకుని పై దండెత్తి తారకసంహారం చేసాడు. దేవతలనే కాపాడిన కుమారుడిని మానవులంతా పూజించారు. వారి పూజలనుమెచ్చిన శివకుమారుడు మానవులకు సంతానసౌభాగ్యమనే వరం ఇచ్చాడు. సర్వసంపదలను కలుగచేశాడు. ఆ శివకుమారుణ్ణే సుబ్రహ్మణ్యేశ్వరునిగా కీర్తించారు. ఆ శివకుమారుడే సుబ్రహ్మణ్యునిగా లింగరూపంలో నేడు కృష్ణాజిల్లలోని మోహినీ పురమను చోట వెలిశాడు. కాలక్రమంలో ఈ మోహినీ పురమే మోపీ దేవిగా స్థిరపడింది. ఈ లింగాకృతిలో ఉన్న సుబ్రహ్మణ్యుని కొలిచిన వారికి తీరని కోరిక ఏదీ వుండదనుప్రఖ్యాతి ఉంది. ఇక్కడ సర్పదోషాలు ఉండేవారు నివారణార్థం పూజలు చేస్తుంటారు. పెళ్లి కాని యువత కూడా ఈ మోపీదేవి సుబ్రహ్మణ్యుని కొలిచినవారికి త్వరలో కల్యాణ యోగం పడుతుందని అంటారు.
స్థలపురాణం:
ఒకానొక కాలంలో అగస్త్య మహాముని అపారంగా పెరిగే వింధ్య పర్వతాన్ని అణచడానికని కాశీని విడిచి వచ్చాడు. అగస్త్యుని శిష్యుడైన వింధ్యుడు మహాముని దర్శనం చేసుకొని తన శరీరాన్ని వంచి నమస్కరించాడు. అపారంగా పెరుగుతున్న తనపరిమాణాన్ని తగ్గించుకున్నాడు. దాన్ని చూచిన అగస్త్యుడు సంతోషించి ‘‘వింధ్యా నీ పరిమాణము ఇలాగునే ఉంచు నేను తిరిగి ఈ దారిన వస్తాను. అప్పటిదాకా నీవు ఇలాగే వుండు’’ అని ఆదేశించి ముందుకు నడిచాడు. అలా వస్తున్న అగస్త్యుడు కృష్ణాతీరానికి చేరుకోగానే అక్కడ కళ్లు మిరుమిట్లు గొలిచేటట్లు కాంతి కనబడిందట. ఆ కాంతి ఎక్కడ నుంచి వస్తోందో అని చూచేసరికి అక్కడంతా పుట్టలు కనబడ్డాయి. ఆ పుట్టల్లోని ఒక పుట్టనుంచి వెలుతురు రావడం చూచి ఆ కాంతికి కారణం సుబ్రహ్మణ్యేశ్వరుడే నని తలచి అతనికి నమస్కారం చేశాడు. ఈ వెలుతురును మానవులంతా చూడలేరని లోకకల్యాణార్థం పడగవలె నున్న లింగాన్ని అక్కడ ప్రతిష్ఠిచారట. అప్పటి నుంచి సుబ్రహ్మణ్యేశ్వరుడు లింగరూపంలో దర్శనం ఇస్తున్నారు.
ఈ ప్రాంతంలోనే వీరారపు పర్వతాలనే వ్యక్తి సుబ్రహ్మణ్యేశ్వరుని భక్తుడుగా ఉండేవాడు. అతడు నిత్యం ఈ సుబ్రహ్మణ్యుని గుడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకొని వెళ్లేవాడు. ఎంతో నియమ నిష్టలతో ఇంట్లో కూడా సుబ్రహ్మణ్యేశ్వరునికి పూజలు చేసేవాడు. అట్లాంటి నిజభక్తుడైన వీరారపు పర్వతాలును శివకుమారుడు అనుగ్రహించాడు. ఒకరోజున పర్వతాలుకు స్వప్న దర్శనం ఇచ్చాడు. ‘‘ఇక్కడున్న పుట్టల్లో లింగాకృతిలో నేనున్నాను. నాకోసం దేవాలయ నిర్మాణం చేసి రోజూ నన్ను పూజించుకో నీవు కోరిన కోరికలు తీరుతాయి’’ అని స్వామినే చెప్పాడట. వీరారపు పర్వతాలు తన స్వప్నం గురించి చుట్టు పక్కల వాళ్లకు వెళ్లి చెప్పగా అందరూ కలసి వచ్చి ఈ పుట్టల్లో చూడగా ఇక్కడ అగస్త్య ప్రతిష్ఠ అయిన సుబ్రహ్మణ్యేశ్వరుడు లింగరూపంలో దర్శనమిచ్చాడట. వారంతా ఆ లింగాన్ని వెలికితీసి దేవాలయ నిర్మాణం చేసి అందులో స్వామిని ప్రతిష్టించారట. అలా తన భక్తులైనవారిని సదా కాపాడుతుండడం కార్తికేయుని లక్షణం.
ఇక్కడ గర్భగుడిలో వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యు నికి ఇరువైపులా వల్లీ దేవసేన కొలువైయ్యారు. ప్రతిరోజు సుబ్రహ్మణ్యశ్వరునికి నిత్యపూజలతో పాటుగా నిత్యకల్యాణసేవలు కూడా చేయడం ఇక్కడి విశేషం. గర్భాలయానికి వెనుకభాగంలో పుట్టపైన నాగప్రతిష్టలు ఉంటాయ. ఈ పుట్టనుంచి ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపంలో ఇక్కడి లింగాన్ని చుట్టుకుని పడుకుంటాడని భక్తులు చెబుతుంటారు. ఇక్కడున్న నాగప్రతిష్ఠ లను పాలతో అభిషేకం చేస్తే కోరిన కోరికలు ఈడేరుతాయని భక్తులంతా క్షీరాభిషేకాలు చేస్తుంటారు. ఇలా ఆ లింగాకృతిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరుని కొలిచిన భక్తులకు కోరిన కోరికలు ఈడేరుతాయి. కుజదోషం, గ్రహదోషాలున్నవారు ఈ ఆలయ దర్శనం చేసుకొంటే వారి చీడపీడలు దూరమవుతాయని ఇక్కడి యాత్రీకులు చెప్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన జనులతో మోపీ దేవి ఆలయం నిత్య కల్యాణ శోభతో వెలుగొందుతుంటుంది.

- హనుమాయమ్మ