సబ్ ఫీచర్

భాజపాదే పైచేయ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత రాష్టప్రతిగా తమ పార్టీకి చెందిన నేత ఎన్నికయ్యేలా చేయడంలో బిజెపి అధినాయకత్వం సఫలీకృతం అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి తన అభ్యర్థిని రాష్టప్రతిగా గెలిపించుకొనే బలం బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఏ కూటమికి లేదు. అయితే, ప్రతిపక్షాల అనైక్యతే బిజెపికి వరంలా మారే అవకాశం ఉంది. రాష్టప్రతి ఎన్నికకు సంబంధించి ‘ఎలక్టొరల్ కాలేజీ’లో పూర్తి బలం లేకున్నా ఎన్‌డిఎ కూటమి తన అభ్యర్థిని గెలిపించుకొనేలా ఇప్పటికే వ్యూహరచన ప్రారంభించింది.
దేశంలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 4114, పార్లమెంటు సభ్యుల సంఖ్య (లోక్‌సభ, రాజ్యసభ కలిపి) 784. రాష్టప్రతిని పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు ఎన్నుకుంటారు. శాసనసభ్యుల ఓటు విలువ ఆయా రాష్ట్రాల జనాభాపై ఆధారపడి ఉంటుంది. మొత్తం శాసనసభ్యుల (4114 మంది) ఓట్ల విలువ 5,49,474 కాగా, పార్లమెంటు సభ్యుల ఓట్ల విలువ 5,55,072. ఎలక్టొరల్ కాలేజీలోని మొత్తం సభ్యుల ఓట్ల విలువ 11,04,546. ఎన్‌డిఏలో 23 రాజకీయ పార్టీలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఎన్‌డిఎ తరఫున 1691 మంది శాసనసభ్యులు, 418 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. వీరి మొత్తం ఓట్ల విలువ 5,37,701. కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఏలో 23 రాజకీయ పార్టీలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. యుపిఏ తరఫున 1710 మంది శాసనసభ్యులు, 244 మంది పార్లమెంటు సభ్యులున్నారు. యుపిఏలోని శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల ఓట్లు విలువ 3,92,447. ప్రస్తుతం ఎలక్టొరల్ కాలేజీలో ఎన్‌డిఏ బలం 48.68 కాగా యుపిఎ బలం 35.47 శాతం.
రాష్టప్రతి ఎన్నికకు సంబంధించి ప్రస్తుతానికి అన్నాడిఎంకె, బిజూ జనతాదళ్, టిఆర్‌ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఐఎన్‌ఎల్‌డి తదితర పార్టీలు తటస్థంగా ఉన్నాయి. తటస్థ పార్టీల మొత్తం శాసనసభ్యులు 510 కాగా, వారి ఓట్ల విలువ 71,495 పార్లమెంటు సభ్యులు 109 కాగా వారి ఓట్ల విలువ 72,924. ఎలక్టొరల్ కాలేజీలో తటస్థుల ఓట్ల విలువ 13.06 శాతం కాగా, ఇటీవల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్టప్రతి ఎన్నికల్లో బిజెపికి మద్దతు ప్రకటించారు.
తెరాస కూడా బిజెపి అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తమిళనాడులో ప్రస్తుత రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లో అన్నాడిఎంకెలోని రెండు వర్గాలు లేదా ఒక వర్గం బిజెపికి మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతర రాజకీయ పక్షాలు ఐక్యంగా ఉంటే రాష్టప్రతి ఎన్నికలో బిజెపిని నిలువరించడం పెద్ద కష్టం ఏమీ కాదు. అయితే, ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరే అవకాశాలు కనిపించడం లేదు. ఏకాభిప్రాయ సాధనకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడ లేవు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన కార్యక్రమంలో నిమగ్నమై ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్ణయించిన వారే భారత నూతన రాష్టప్రతిగా పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

-పి. మస్తాన్‌రావు