డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ 13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా ఇద్దరిని చూస్తే అక్కడున్న బంధువులందరికి కొంచెం బాధ అనిపించి ఉండచ్చు.
కొత్తగా పెళ్లి అయింది.
గట్టిగా మూడు రోజులు.
అంతలోనే ఎడబాటు.
అందరి నిశ్శబ్దం భంగం చేస్తూ అతని మేనమామ వాతావరణం కాస్త తేలికగా చెయ్యాలని కాబోలు.
‘‘చూశావా అక్కయ్యా! నీ కొడుకు అమెరికా వెళ్లకముందే, అమెరికన్ అయిపోయాడు’’ అన్నాడు నవ్వుతూ!
అందరికి తెలుసు అతను దేనిని ఉద్దేశించి అంటున్నాడో. నా అర చేతులు మళ్లీ తడి అయిపోయాయి.
‘‘పోరా! నీ మాటలకేం అంది’’ అత్తగారు.
అందరూ ఇళ్ళకు వెనుదిరిగారు. నాన్న, అమ్మ రేపు వచ్చి కనిపిస్తామని, అమ్మాయిని తీసుకువెడతామని చెప్పి వెళ్లిపోయారు.
నేను రఘు కుటుంబంతో కలిసి ఇంటికి వెనక్కి తిరిగి వచ్చాను.
ఆ రాత్రి పడుకోవడానికి అతని గదిలోకే వెళ్లాను. ఎందుకనో మొదటిరోజుకంటే ఎక్కువ భయం అనిపించింది. చాలా ఒంటరిగా అనిపించింది. చాలాసేపు కిటికీ దగ్గర నిలబడిపోయాను. గడిచిన మూడు రోజులు సినిమా రీల్సులా మనసులో తిరుగుతున్నాయి.
మంచంమీద పడుకుని ముందు రాత్రుల సంఘటనలు తలచుకుంటూంటే కళ్ళనుంచి నీరు కారిపోయి దిండు తడిసిపోయింది. రఘు అన్నట్లు, ఈ అనుబంధం అపురూపం అది నిజమే!
ఆ రోజు మధ్యాహ్నమే రఘు అన్నాడు నాతో ఎదురుగా నించుని.
‘‘ఏమిటో ఈ అమెరికా వెళ్లాలనుకోవడం కొత్తగాదు. నా చిన్నప్పటికల. అమెరికా వెళ్లి అక్కడ రీసెర్చ్ చెయ్యాలని, కాని ఇవాళ నిజంగా వెడుతున్నానంటే చాలా దిగులుగా ఉంది’’ అన్నాడు.
అతని మొహం చూస్తే మొదటిసారిగా అమ్మని విడిచి స్కూలుకు వెళ్ళే కుర్రాడి మొహంలా ఉంది.
‘‘అది సహజమే కదా! స్వంత దేశం, స్వంత ఊరు, స్వంత ఇల్లు, అమ్మా, నాన్న, స్వంతమయినవన్నీ వదిలి వెళ్లాలంటే దిగులు అనిపిస్తుంది కదా!’’ అన్నాను.
‘‘ఈ స్వంతలిస్టులో నువ్వు లేవా?’’ అన్నాడు చిరునవ్వుతో నా వంక చూస్తూ.
లేనన్నట్లు తల అడ్డంగా ఊగించాను. ‘‘అవన్నీ మీరు పుట్టినప్పటినుంచి పెనవేసకుపోయాయి. నాతో ఈ అనుబంధం నాలుగు, ఐదు రోజులదే కదా!’’ అన్నాను.
‘‘అందుకనే ఇది మరీ అపురూపం. అసలు ఇప్పుడు అమెరికా వెళ్లాలనే లేదు. అన్నీ మానేసి నీతోనే ఉండిపోవాలని ఉంది. అమెరికా, ఆఫ్రికా జాన్తా నై’’ ‘‘ఆల్ ఐ వాంట్ ఈజ్ యూ’’ అన్నాడు.
తల అడ్డంగా ఊగించాను ‘‘అంతా అబద్ధం’’.
‘‘అదేమిటి’’
‘‘మీరు ఒక్కసారి లాబరేటరీలో అడుగుపెడితే అన్నం తినడం కూడా మీకు గుర్తుండదు. ఇక నేనేం గుర్తుంటాను?’’ అన్నాను.
హాయిగా నవ్వాడు. ‘‘రుూ మాటరు ఎవరు చెప్పారు, అమ్మేనా?’’ అంటూ మళ్లీ నవ్వాడు. ‘‘మా అమ్మకు నా భోజనం గోల తప్పితే మరొకటి వుండదు. ప్రతి ఏడూ బరువు పెరిగిపోతున్నా సరే ఎంత చిక్కిపోయావురా?’’ అంటుంది.
‘‘ఒక్కసారి నువ్వు నా దగ్గరకు వచ్చేశాక, ఆ బాధ్యత నీమీదకు తోసేసి తను నిశ్చింతగా ఉంటుందేమో!’’ అన్నాడు నవ్వుతూనే!
‘‘అదెప్పుడు?’’ అడుగుతుంటేనే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
‘‘నా చేతిలో ఉంటే ఇప్పుడే! అని అనేవాడిని. నిన్ను విడిచివెళ్ళడం నాకు అసలు ఇష్టమే లేదు’’ అన్నాడు.
కళ్ళల్లో నిండిన నీరు బుగ్గలమీదకు జారాయి. వంగి ముద్దుపెట్టుకోబోతున్న అతని పెదిమలకు తగిలాయి. చెయ్యి ఎత్తి భుజం దగ్గర ఉన్న షర్టుకి పెదిమలు తుడుచుకున్నాడు.
‘‘కళ్ళల్లోంచి జారే నీటికి రుచి ఎందుకు మారిపోతుందో రీసెర్చి చేసి ఓ పేపర్ రాసి నీకు అంకితం ఇస్తాను’’ అన్నాడు.
నవ్వాలని ప్రయత్నిస్తూ అతని వంక కళ్ళెత్తి చూశాను. ‘‘నిజం! పెదిమలు అంత తియ్యగా ఎందుకు ఉంటాయో, కన్నీళ్ళు ఎందుకు ఇంత ఉప్పగా ఉంటాయో నువ్వు చెప్పు మరి?’’ అన్నాడు నన్ను నవ్వించాలని.
గడిపింది మూడు రోజులే అయినా జీవితాంతం గుర్తుండిపోయే అంత మధుర ఊహలుగా మిగిలిపోయాయి.
అతనితో గడిపిన ప్రతీ క్షణం పదే పదే తలచుకుంటూంటే కళ్ళమీదకు వచ్చే నిద్ర ఆగిపోయింది. మంచంమీంచి దిగివచ్చి, రఘు ఇచ్చిన పూల మాలను చేతుల్లోకి తీసుకున్నాను.
మామగారి పార్ట్‌నర్ రఘుకు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చి ఆ గులాబీ దండను రఘు మెడలో వేశాడు. ఆ మాల చాలాసేపు రఘు చేతిమీదే ఉంది. విమానం వైపు వెడుతూ వెడుతూ ఆ దండ చేతిమీద వేశాడు.
వతె్తైన గులాబీల మాల మూలంగా మెత్తగా సున్నితంగా ఉంది. సువాసన కూడా చాలా సున్నితంగా వస్తోంది. చల్లగా సేద తీరుస్తున్నట్లుగా ఆ పూలను పెదిమలతో ముద్దుపెట్టుకున్నాను. అప్రయత్నంగా ఆ దండను కౌగలించుకున్నాను. అచ్చం రఘు నన్ను కౌగిలించుకున్నట్లుగానే! బహుశ, నేనూ ఇలాగే అతనికి తగిలి ఉంటాను అనుకున్నాను. అప్రయత్నంగా నా పెదిమల మీదకు చిరునవ్వు వచ్చింది. గులాబీ దండతో సహా మంచంమీదకు వెళ్లి చేతిలో దండతోనే నిద్రపోయాను.
తెల్లవారి లేచేటప్పటికి క్రింద గుత్తిగా వేలాడుతున్న పూలు ఊడి మంచంమీద పడ్డాయి. ఓ రెండు పూలు తీసి బల్లమీద ఉన్న మాగజైన్లో ఉంచి, ఆ మాగజైన్ని నా పెట్టెలో పెట్టుకున్నాను. పెట్టె అంతా సర్దుకున్నాను.
నా జీవితంలో జీవిత భాగస్వామితో మూడు రాత్రులు గడిపిన ఆ గదంతా ఒకసారి చుట్టూ చూశాను. టేబుల్‌మీద రఘు ఫొటో ఫ్రేమ్‌లో పెట్టి ఉంది. ఫ్రేమ్ చాలా అందంగా, నగిషీలు చెక్కి ఉంది. చేత్తో పట్టుకుని పైకి దగ్గరగా తెచ్చుకునేటప్పటికి చక్కని గంధపు వాసన వెదజల్లింది ఫొటోలో ఉన్న రఘు చిరునవ్వుకుమల్లెనే!

-ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి