ఆంధ్రప్రదేశ్‌

కబ్జాలకు రాజకీయ అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 2: విశాఖలో పెద్దఎత్తున జరుగుతున్న భూదందాపై ఆర్ అండ్ బి మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఇక్కడ జరిగిన నవ నిర్మాణ దీక్షకు హాజరైన అయ్యన్న విశాఖలో భూకబ్జాలపై చేసిన వ్యాఖ్యలతో అధికారులు, ప్రజా ప్రతినిధులు అవాక్కయ్యారు. విశాఖలో ఎన్‌ఆర్‌ఐ, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని అన్నారు. ఎక్కడి నుంచో విశాఖ వచ్చి కోట్ల రూపాయల విలువైన భూములను ఆక్రమించుకుంటుంటే మనం ఎందుకు చూస్తుండాలని అయ్యన్న ప్రశ్నించారు. ఆక్రమణదారులను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తన మిత్రుడు ఎన్‌ఆర్‌ఐ భూమిని కబ్జాదారులు ఆక్రమించుకున్నారని, పోలీసుల సహకారంతో తిరిగి స్వాధీనం చేసుకున్నామన్నారు. తనకు మాదిరి మిగిలిన బాధితులు భూములను స్వాధీనం చేసుకోలేరు కదా? అని ప్రశ్నించారు. మంత్రిగా సహకరిస్తే, తాను కూడా రెండెకరాలు ఆక్రమించుకుంటానని ఒక వ్యక్తి తన వద్దకు వచ్చాడంటూ అయ్యన్నపాత్రుడు చెప్పారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్, పోలీస్ కమిషనర్ పటిష్ట చర్యలు తీసుకుంటున్నా, రాజకీయ జోక్యంతో వారు ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు. ఇకపై విశాఖ జిల్లాలో భూకబ్జాలను అరికట్టేందుకు మంత్రిగా అధికారులకు తను మద్దతిస్తానని అయ్యన్న చెప్పారు. ఇదిలా ఉండగా జిల్లాలో అవినీతి అధికారుల ఆగడాలు పెరిగిపోతున్నాయని అయ్యన్న అన్నారు. ఆర్ అండ్ బి ఇంజనీర్ వందల కోట్ల అక్రమార్జన ఏవిధంగా కూడబెట్టాడని ప్రశ్నించారు. విశాఖ కేంద్రంగా ఎంతోమంది ఉన్నతాధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూ బకాసురులను, అవినీతి అధికారులను తరిమికొడదామని అయ్యన్న పిలుపునిచ్చారు. అయ్యన్న సభలో మాట్లాడుతున్నంతసేపు, సభలో జనం కేరింతలు కొట్టడం విశేషం.