ఆంధ్రప్రదేశ్‌

గిట్టుబాటు ధరకు శాశ్వత కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 2: పౌర సరఫరాలు, మార్క్‌ఫెడ్, గిడ్డంగుల శాఖలు సమన్వయం చేసుకుంటూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు. మిర్చి, పసుపు కొనుగోలును నెలాఖరు వరకూ పొడిగించడంతోపాటు, కల్పిస్తున్న అదనపు గిట్టుబాటు ధర సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో సిఎం చంద్రబాబు మార్కెటింగ్ శాఖపై సమీక్ష నిర్వహించి పసుపు, మిర్చి కొనుగోలుపై ఆరా తీశారు. రైతులు సంక్షోభంలో ఉన్నప్పుడు మాత్రమే అదనపు ధర చెల్లించడం సరికాదని, రైతులకు ఎల్లప్పుడూ గిట్టుబాటు ధర లభించేలా శాశ్వత కార్యాచరణ రూపొందించి నిరంతర ప్రక్రియలా కొనసాగించాలని దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పసుపు కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకూ 1,74,474 క్వింటాళ్లు, మిర్చి కొనుగోలు కేంద్రాల ద్వారా 4,77,425 క్వింటాళ్లు కొనుగోళ్లు జరిగాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు పసుపుకు రూ.110 కోట్లు, మిర్చికి రూ.71 కోట్లు వ్యయం చేశామని చెప్పారు. వ్యవసాయ మార్కెటింగ్‌లో అధునాతన పోకడలను అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. పౌరసరఫరాలు, మార్క్‌ఫెడ్ శాఖలు ప్రొఫెషనల్‌గా మారాలన్నారు. మన అవసరాలకు ఉపయోగించుకుని ఎగుమతులు చేసే స్థాయికి ఈ శాఖలు రావాలని చెప్పారు. రాష్ట్రంలోని రైతుల అవసరాల మేరకు తగినన్ని గిడ్డంగులు నిర్మించాలని అన్నారు. కోల్డ్‌స్టోరేజి చైన్ లింక్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయొద్దని, రైతుకు గిట్టుబాటు ధర లభించేలా చేయడంలో రాజీపడబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతు పండించిన కూరగాయలు, ఇతరత్రాలు నేరుగా ప్రజల ఇళ్లకే వెళ్లి అందించేలా రైతుబజార్లను పటిష్టం చేయాలని ఆదేశించారు. రైతుకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని సిఎం స్పష్టం చేశారు.
చిత్రం: మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సిఎం చంద్రబాబు