ఆంధ్రప్రదేశ్‌

ఇంకా గుడారమే లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 2: రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన గోదావరి అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీ (గుడా) పరిస్థితి అయోమయంగా తయారయ్యింది. ఇప్పటివరకు గుడాకు సంబంధించిన విధి విధానాలు ఖరారు కాలేదు. ఎక్కడ నెలకొల్పుతారో స్పష్టత లేదు. సిబ్బంది నియామకమూ జరగలేదు. కేవలం ఇద్దరు అధికార్లు నియమితులుకాగా వారు పరాయి పంచన కాలక్షేపం చేస్తున్నారు. అయితే గుడాను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ వెలువడగానే, ఇళ్ల నిర్మాణాలు తదితరాలకు ప్లాన్ల మంజూరు మాత్రం నిలిపివేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే గుడా ఛైర్మన్‌గా నియమితులైన గన్ని కృష్ణ శనివారం బాధ్యతలు చేపట్టనున్నారు.
గోదావరి డవలప్‌మెంట్ అధారిటీని ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది మార్చి 15న ప్రభుత్వం జీవో నెం 96 జారీ చేసింది. ఛైర్మన్‌గా రాజమహేంద్రవరానికి చెందిన టిడిపి నేత గన్ని కృష్ణను నియమించారు. వైస్ ఛైర్మన్‌గా ఐఏఎస్ అధికారి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ వేగేశ్న విజయరామరాజు బాధ్యతలు చేపట్టారు. గన్ని కృష్ణ కూడా శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన జీవోలో పేర్కొన్న అధికారులు ఎక్కడ బాధ్యతలు తీసుకోవాలో, ఎక్కడ కూర్చోవాలో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. వాస్తవానికి గుడా కార్యాలయానికి ఒక జాయింట్ డైరెక్టర్, ఇద్దరు డిప్యూటీ డైరెక్టర్లు, నలుగురు అసిస్టెంట్ డైరెక్టర్లు, పదిమంది సిబ్బందిని నియమించాల్సి ఉంది. వీరిలో ఒక డిప్యూటీ డైరెక్టర్‌ను మాత్రమే ఇప్పటి వరకు నియమించారు. ఆయనకు రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో రెవెన్యూ సెక్షన్‌లో ఒక టేబుల్ వేశారు. కాకినాడలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌ను నియమించారు. సదరు అధికారికి కాకినాడ కలెక్టరేట్‌లో ఒక టేబుల్ వేసి కూర్చోబెట్టారు. గోదావరి అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీ ప్రధాన కార్యాలయాన్ని రాజమహేంద్రవరంలోనే ఏర్పాటు చేయాలని కౌన్సిల్ తీర్మానించినప్పటికీ, ఇంకా ఈ విషయంలో స్పష్టతలేదు.
నిలిచిపోయిన ప్లాన్, లేఅవుట్ అనుమతులు
పరిస్థితి ఇలావుంటే గుడా నోటిఫికేషన్ జారీ అయిన మరుక్షణం నుంచీ నిర్దేశిత పరిధిలో డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీప్లాన్ విభాగం నుంచి జారీ అయ్యే ప్లాన్, లే అవుట్ అనుమతులన్నీ నిలిచిపోయాయి. ప్లాన్ అనుమతి ఎవరిస్తారో తెలియని స్థితి నెలకొంది. దీంతో వందలాది దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి. ఒక్క రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పారేషన్‌లోనే దాదాపు 6 వేల ప్లాన్, లే అవుట్ ప్లాన్ దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి. మూలిగే నక్కపై తాడికాయపడినట్టు ఇప్పటికే పెద్ద నోట్ల రద్దు కారణంగా కుదేలైన నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాలు ఇపుడు గుడా పేరుతో పెండింగ్‌తో మరింత అతలాకుతలమవుతోంది. ఎక్కడి కార్యకలాపాలు అక్కడ స్ధంభించిపోవడమేకాక, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. చిత్రమేమిటంటే ఇంటి ప్లాన్ కోసం దరఖాస్తుచేసుకున్నవారంతా ఎంతకీ ప్లాన్ వచ్చే దారిలేకపోవడం వల్ల ఇళ్లు నిర్మించేసుకుని గృహ ప్రవేశాలు కూడా చేసేశారు. ఇటువంటి ఇళ్లకు నగరపాలక సంస్థ పన్నులు కూడా వేసేసింది. ఇంకా అనుమతులు రాని ఎన్నో దరఖాస్తులు పెండింగ్‌లోనే వున్నాయి. మొత్తం 26 మండలాలను పరిగణలోకి తీసుకుని 2183.02 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో గోదావరి అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీని పరిధిని నిర్ణయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేస్తూ బోర్డు మెంబర్లను కూడా ఇప్పటికే నియమించారు. అయితే ఈ మండలాలను కలిపి గుడా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాల్సి వుంది. ఇప్పటి వరకు మాస్టర్ ప్లాన్ పరిధిలోవున్న ప్రాంతాల్లో డైరెక్టర్ ఆఫ్ కంట్రీప్లానింగ్ నుంచి 33 అడుగుల రోడ్లను విభజిస్తూ అనుమతి లభించేది. గుడా పరిధిలో 40 అడుగుల రోడ్లకు మాత్రమే ప్లాన్ మంజూరవుతుంది. సిఆర్‌డిఎ నిబంధనలు గుడాకు వర్తింపజేస్తారని అంటున్నారు. ఈ మేరకు కొత్తగా గుడాకు మరో మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు తొలి సమావేశంలో తీర్మానానికి కసరత్తు మొదలుకానుంది. ఏదేమైనప్పటికీ గుడా విధులు ఎంత తొందరగా సిద్ధమైతే అంత తొందరగా నిర్మాణ రంగంలో చలనం లభిస్తుందంటున్నారు. లేదంటే అభివృద్ధి స్థంభించినట్టే.
చిత్రం: రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘గుడా’ బోర్డు