ఆంధ్రప్రదేశ్‌

డ్రోన్ హబ్‌గా ఏపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 3: గ్లోబల్ డ్రోన్ హబ్‌గా ఏపీని మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ఐటి మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ప్రతినిధులతో శనివారం సమావేశమై డ్రోన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి విశాఖలో డ్రోన్ తయారీ, పరిశోధన, నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఓనీ ప్రెజంట్ సంస్థ ముందుకొచ్చింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా డ్రోన్‌ల వినియోగం పెరుగుతోందని, ప్రస్తుతం డ్రోన్ల తయారీలో చైనా లీడర్‌గా ఉందన్నారు. చైనాకంటే తక్కువ ఖర్చుతో డ్రోన్‌లు తయారు చేయాలని, దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధం, సిఆర్‌డిఎ, పోలవరం పనుల పర్యవేక్షణ, స్మార్ట్ పోలీసింగ్‌లో డ్రోన్‌లను ఉపయోగించుకునే అవకాశం ఉందన్నారు. సిమెంట్ కంపెనీలు, ఆయిల్, గ్యాస్ కంపెనీలు, మైనింగ్, ఇరిగేషన్, వ్యవసాయ రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా డ్రోన్‌లకు డిమాండ్ పెరుగుతోందన్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యార్థులను తయారుచేస్తే ఉపాధి సులువవుతుందన్నారు.
ఇంటికో పారిశ్రామికవేత్త
సచివాలయంలో ఫిక్కీ ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమావేశం నిర్వహించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన టెక్నాలజీ బిజినెస్ యాక్సిలేటర్ పనితీరుపై చర్చించారు. చదువు పూర్తి చేశాక, ఉద్యోగం కోసం ఎదురుచూసే పరిస్థితి లేకుండా ప్రతి ఇంటిలోనూ ఓక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా ప్రణాళిక ఉండాలన్నారు. యువతలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. స్టార్ట్ అప్ కంపెనీలకు కావాల్సిన వౌలిక వసుతులు కల్పించి అన్ని విధాలుగా ప్రొత్సహిస్తామన్నారు. తిరుపతిలోని యాక్సిలేటర్ ద్వారా రానున్న పదేళ్లలో వెయ్యి కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయని ఫిక్కీ ప్రతినిధులు వివరించారు. ఎపిఐఎస్‌జెడ్‌టిఇ కంపెనీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ స్మార్ట్ సిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్‌కు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో విశాఖలో ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు చేయలని కోరారు. చైనాలో క్విన్గ్ హాయ్‌లో అతి పెద్ద హబ్‌ను నెలకొల్పామని, ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. విశాఖలో ఏర్పాటు చేయబోయే సెంటర్ ద్వారా రానున్న రోజుల్లో 1000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వస్తాయని కంపెనీ ప్రతినిధులు వివరించారు.

ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ, ఫిక్కీ, ఓనీ ప్రెజంట్ ప్రతినిధులతో సమావేశమైన ఐటి మంత్రి నారా లోకేష్