ఆంధ్రప్రదేశ్‌

రైతులకు భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 4: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించి వారిలో భరోసా పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉండవల్లిలోని తన నివాసంలో మూడోరోజు నవ నిర్మాణ దీక్షపై ఆదివారం ఉదయం టెలికాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 1700 కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీ అందజేశామని, పైసా అవినీతి జరగకుండా 24వేల కోట్ల రూపాయల మేరకు రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు. పంట సంజీవని, రెయిన్‌గన్ టెక్నాలజీతో వ్యవసాయ రంగంలో చేపట్టిన వినూత్న చర్యల గురించి రైతులకు వివరించాలన్నారు. రైతుల్లో భరోసా పెంచి ఖరీఫ్‌కు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏ పంటకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది తలెత్తుతుందో అంచనా వేయాలన్నారు. తీవ్ర రెవెన్యూ లోటు పరిస్థితుల్లోనూ మిర్చి, పసుపు కొనుగోళ్లు జరిపి రైతులను ఆదుకున్న విషయాన్ని వివరించాలన్నారు. రెండోరోజు నవ నిర్మాణ దీక్షలో 339 అంశాలపై చర్చలు జరిగాయని, 112 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పాల్గొన్నారని ఆయన తెలిపారు. 1.98 లక్షల మంది ప్రజలు హాజరయ్యారని తెలిపారు. ఇదే స్ఫూర్తిని మిగిలిన రోజుల్లో దీక్షల్లోనూ చూపించాలని పిలుపునిచ్చారు. ఆదివారమైనా పట్టు సడలకుండా దీక్షలు కొనసాగిస్తున్నామన్నారు. సంస్కరణలకు సాంకేతికత తోడైతే ఫలితాలు అద్భుతంగా ఉంటాయన్నారు. లబ్ధిదారుల విజయగాథలకు ప్రాచుర్యం కల్పిస్తూ అందరికీ స్ఫూర్తిదాయంగా నిలవాలని సూచించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నవారికి ఈ దీక్షల్లో ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఇది పేరుకోసం చేసేది కాదని, పనిచేసి చూపించే కార్యక్రమమన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం చేస్తున్న దీక్షలని వివరించారు. ప్రజలంతా మనస్ఫూర్తిగా పాల్గొని సంఘీభావం ప్రకటించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి సుజయకృష్ణ రంగారావు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, అధికారులు పాల్గొన్నారు.

విజయవాడలో ఆదివారం సంచార పశువైద్య సేవా కేంద్రాన్ని
ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు