Others

నోరు జారితే.. ( శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడ పిల్ల కాలుజారినా, మగాడు నోరుజారినా అనర్ధం అంటారు పెద్దలు. ఇవ్వాళ చలపతిరావు పరిస్థితి అలాగే తయారైంది. దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు సినిమా రంగంలో చాలాకాలంగా తెరమీద కన్పిస్తున్నా గుర్తింపుగల పాత్ర మచ్చుకి ఒకటైనా లేకుండా సీనియర్ నటుడని పిలిపించుకొంటున్న నటుడు చలపతిరావు. ఆ నటుడి జీవిత కాలంలో చాలెంజ్ రోల్ అంటూ గుర్తుంచుకోదగ్గ పాత్ర ఏదైనా వుందా? అంటే సమాధానం లేని ప్రశ్నగా మిగులుతుంది. కుమారుడు దర్శకుడు అయిన తర్వాత సహాయ పాత్రల సంఖ్య మాత్రమే పెరిగింది తప్ప అవి కూడా అంతగా గుర్తుంచుకొనేవి కావు. ఆఖరికి ‘రారండోయి...’ చిత్రంలోనూ అలాటి పాత్రలలో ఒకటే. ఈ పరంపర ఇలాగే కొనసాగించక ఎందుకీ ఈ వివాదంలో అడుగుపెట్టాడో చలపతిరావు చెప్పాలి. ఇప్పటికైనా చలపతిరావుతోపాటు ఆ చిత్ర నిర్మాతలు ఈ వివాద పరిష్కారానికి నడుంకట్టి ఫుల్‌స్టాప్ పెడితే మంచిది. మహిళల ఆగ్రహానికి గురైతే రాబోయే కాలంలో చలపతిరావు నటించిన చిత్రాల ప్రదర్శనకే హానికరంగా మారుతుంది. బాహుబలి చిత్రంలో కట్టప్పగా నటించిన సత్యరాజ్ నోరుజారిన విషయం గుర్తుంది కదా. అది బాహుబలి-2 చిత్రం విడుదలకు ఒక ఆటంకంగా మారింది. అదృష్టవశాత్తు నిర్మాతలు ఆ గండంనుంచి బయటపడగలిగారు. నిజానికి చలపతిరావు వ్యాఖ్యలకు ఆ కార్యక్రమంలో పాల్గొన్న యాంకర్ల తీరూ కారణమే. పేరుగల నిర్మాణ సంస్థలు ఈ విషయంలో జాగ్రత్తపడితే మంచిది. ఏదేమైనా అనవసరపు అలజడులు, సీనియర్లు నోరుజారటం పరిశ్రమకు ఆరోగ్యకరం కాదు. దీనికి అంతం పలకటమే పరిశ్రమ ప్రథమ కర్తవ్యం.

-పర్చా శరత్‌కుమార్ 9849601717