Others

చిన్నారుల గుండె పదిలం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైపర్‌యాక్టివ్ నియంత్రణ కోసం వాడే మందులు పిల్లల గుండెకు చేటు తెస్తున్నాయని పరిశోధకులు అంటున్నారు. సౌత్ ఆస్ట్రేలియా యూనివర్శిటీకి చెందిన నికోల్‌ప్రాట్ సమర్పించిన పరిశోధనా పుస్తకంలో వెల్లడించారు. ఈమేరకు సౌత్ కొరియాకు చెందిన 1,14,647 మంది పిల్లలపై పరిశోధనలు చేశారు. వీరందరి వయసు పదిహేడేళ్లు. ఈ పిల్లలు 2008 నుంచి 2011 వరకు హైపర్‌యాక్టివ్ నియంత్రణ కోసం మందులు వాడారు. వీరిలో 1,224మంది తొలిసారి గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. అలాగే 864మంది పిల్లలకు గుండె కొట్టుకోవటంలో ఇబ్బందులు, 395మంది పిల్లలకు అధిక రక్తపోటు, 57మందికి గుండెపోటు, 67మందికి చిన్నగా స్ట్రోక్స్ రావటం, 44మందికి హార్ట్ ఫెయిల్యూర్ సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. హైపర్‌యాక్టివ్ పిల్లలకు వైద్యులు సూచించిన మందులు వాడటం వల్లే ఈ దుష్పరిణామాలు సంభవించినట్లు గుర్తించారు. దాదాపు ఈ పిల్లలకు ట్రీట్‌మెంట్ ప్రారంభించిన 56రోజులు తరువాత గుండెలో ఇలాంటి మార్పులు, సమస్యలు తలెత్తినట్లు పరిశోధకులు గుర్తించారు. కాబట్టి ఈ వ్యాధితో బాధపడే పిల్లలకు ఈ మందులు సూచించకుండా కాపాడాలని వైద్యులను కోరుతున్నారు. ఈ మందులు చిన్నారుల గుండెపై తీవ్ర ప్రభావం చూపుతున్నందున తక్షణమే ఆపేస్తే మంచిదని కూడా వారు అంటున్నారు.