Others

పిల్లలకు పాలిస్తే రొమ్ము క్యాన్సర్ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రోజుల్లో మహిళల్లో రొమ్ము క్యాన్సర్ సర్వసాధారణమై పోయింది. ఎంతోమంది దీనిబారిన పడుతున్నారు. ఈ క్యాన్సర్ బారిన పడుకుండా ఉండాంటే బాలింతలు బిడ్డలకు ఆరు నెలలపాటు పాలివ్వాలని అంటారు. ఆరు నెలల పాటు పిల్లోలకు పాలిస్తే వారికి సంపూర్ణ ఆరోగ్యంతో పాటు తల్లులు క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడవచ్చని ఆస్ట్రేలియాకు చెందిన మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. అవకాశం ఉంటే తొమ్మిది నెలల పాటు ఇచ్చినా మంచిదని వారు అంటున్నారు. ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో చాలా మంది తల్లులు పిల్లలకు పాలు ఇవ్వటం లేదని, ఇది వారిని రొమ్ము క్యాన్సర్ బారిన పడేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాదాపు 26,000 మంది మహిళలపై పరిశోధనలు చేశారు. వీరు ఎంత కాలం పిల్లలకు పాలు ఇచ్చారో పరిశీలించారు. పిల్లలకు పాలు సరిగా ఇవ్వని దాదాపు 9,000 మంది క్యాన్సర్ బారిన పడినట్లు గుర్తించారు.