రాష్ట్రీయం

అప్పుడు అలా..ఇప్పుడు ఇలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 25: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడుదల చేసిన శే్వతపత్రం అడవుల్లో మంట పుట్టిస్తోంది. శే్వతపత్రాన్ని పరిశీలిస్తే బాక్సైట్ తవ్వకాలకే బాబు మొగ్గుచూపుతున్నట్టు అర్థమవుతోంది. పక్క రాష్ట్రాల్లో బాక్సైట్ తవ్వకాలు జరుపుతున్నప్పుడు, ఇక్కడ తవ్వకాలు జరిపితే తప్పేంటని ప్రశ్నిస్తున్నట్టుంది. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు స్వయంగా గవర్నర్‌ను కలిసి బాక్సైట్ తవ్వకాలపై జరిగిన ఒప్పందాలను రద్దు చేయాల్సిందిగా వినతిపత్రం ఇచ్చారు. అదే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత బాక్సైట్ తవ్వకాలకు రంగం సిద్ధం చేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి స్టేజ్-1కు అనుమతులు ఇవ్వడానికి యుపిఎ ప్రభుత్వానికి దాదాపు ఐదు సంవత్సరాల కాలం పట్టింది. స్టేజ్-2 అనుమతులను మాత్రం నరేంద్ర మోదీ ప్రభుత్వం 14 నెలల్లోనే ఇచ్చేసింది. అంతటితో ఆగకుండా తవ్వకాలకు మార్గాన్ని సుగమం చేయమని రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తవ్వకాల బాధ్యతను ఎపిఎండిసికి అప్పగిస్తూ ఈనెల 5వ తేదీన 97 నెం జిఓ జారీ చేసింది. అప్పటి నుంచి ఏజెన్సీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈనెల 16న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బాక్సైట్ తవ్వకాలపై చర్చించి, 97 జిఓ తమకు తెలియకుండా జారీ అయిందంటూ మంత్రి వర్గం బయటకు చెప్పుకొచ్చింది. 97 జిఓపై కొద్ది రోజులు ముందుకు వెళ్లకూడదని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం బాక్సైట్ తవ్వకాలపై శే్వతపత్రాన్ని విడుదల చేశారు. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ఈ ఖనిజం ఉందని, ఒడిశాలో ఈ ఖనిజాన్ని పెద్ద ఎత్తున తవ్వుతున్నారని ఆ శే్వతపత్రంలో చెప్పుకొచ్చారు. బాక్సైట్ నిల్వల్లో భారత దేశం అగ్రస్థానంలో ఉంది. ఒడిశా తరువాత మన రాష్ట్రంలోనే బాక్సైట్ నిల్వలు అధికంగా ఉన్నాయి. ఒడిశా, చత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయి. దేశీయ అవసరాలకు కావల్సిన అల్యూమినియం కోసం ప్రస్తుతం తవ్వుతున్న బాక్సైట్ సరిపోతుంది. విశాఖ ఏజెన్సీలో తవ్వితీసే మొత్తం బాక్సైట్ అంతా చాలా వరకూ ఎగుమతి కోసమేనని నిపుణులు తెలియచేస్తున్నారు. ప్రస్తుతం ఒడిశాలో తవ్వుతున్న బాక్సైట్ వినియోగమే అంతంతమాత్రంగా ఉంది. నాల్కో ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిపోవడంతో బాక్సైట్ వినియోగం చాలా వరకూ తగ్గింది. ఈ విషయమై సిపిఎం రాష్ట్ర నాయకులు నర్సింగరావు మాట్లాడుతూ బాక్సైట్‌పై చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శే్వపత్రంలో పేర్కొన్న లెక్కలు బాగానే ఉన్నాయి.. కానీ ఆయన ఏవిధంగానైనా బాక్సైట్‌ను తవ్వాలన్న కృతనిశ్ఛయంతో ఉన్నట్టు ఆ లేఖనుబట్టి తెలుస్తోందని అన్నారు. ఆయన అనవసరంగా తేనెతుట్టెను కదిలిస్తున్నారని, దాని వలన వచ్చే అనర్థాలను ఆయన గమనించలేకపోతున్నారని నర్సింగరావు అన్నారు.