Others

బీట్‌రూట్ తింటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్ని పోషక విలువలున్న కూరగాయల్లో బీట్‌రూట్ కూడా ముఖ్యమైనదే. టమోటా, కారెట్‌ల లాగానే బీట్‌రూట్ కూడా సమానమైన విటమిన్‌లు కలిగి శరీరానికి అవసరం అయిన పోషకాలను సమృద్ధిగా అందించగలదు.
బీట్‌రూట్‌లో అద్భుతమైన ఆరోగ్య లాభాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా అధిక రక్తపోటుకు ఇది మందు. ప్రస్తుతం ఎక్కువమంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలలో అధిక రక్తపోటు ఒకటి. అధిక రక్తపోటు వలన అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి.
బీపీని సమర్థవంతంగా తగ్గించడంలో బీట్‌రూట్ బాగా పనిచేస్తుంది. బీట్‌రూట్‌లోని నైట్రిట్స్ అనే మూలకం రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుందని పరిశోధకులు గుర్తించారు. ప్రతిరోజూ ఒక గ్లాసు బీట్‌రూట్ జ్యూస్ తాగడంవలన మందులకన్నా మంచి ప్రయోజనాన్ని పొందవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.
వ్యాయామం చేసేవారు బీట్‌రూట్ జ్యూస్ తాగడంవలన రెట్టింపు శక్తిని, సామర్థ్యాన్ని పొందవచ్చని, ఓ గ్లాసు బీట్‌రూట్ జ్యూస్ తాగడంవలన 16 శాతం అధిక శక్తిని పొందవచ్చని పరిశోధనల్లో రుజువైంది. గర్భవతులు బీట్‌రూట్ తీసుకోవడంవలన వారికి అవసరమయ్యే పోలిక్ యాసిడ్ సమృద్ధిగా లభిస్తుంది. పోలిక్ యాసిడ్ గర్భస్థ శిశువు వెనె్నముక ఎదుగుదలకు సహాయపడుతుంది. అంతేకాకుండా గర్భవతులకు అదనంగా అవసరమయ్యే శక్తిని బీట్‌రూట్ అందిస్తుంది.
బీట్‌రూట్‌లో వుండే ప్రోఅంతోసయడిన్ రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ల నివారిణిగా పనిచేస్తుంది. ప్రోఆంతోనియన్‌కు కణుతుల పెరుగుదలను అడ్డుకునే శక్తి వుంది. బీట్‌రూట్‌లోని నైట్రేట్ మెదడు పనితీరును మెరుగుపరిచి శక్తివంతంగా మార్చగలదు. బీట్‌రూట్‌లోని పీచు పదార్థాలు మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. పెద్దప్రేగును శుభ్రపరిచే శక్తి దీనికి వుంది. ఎక్కువ రోజులు బీట్‌రూట్ వాడటంవలన అనేక ఆరోగ్య లాభాలు పుష్కలంగా లభిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

- హిమజారమణ