ఆంధ్రప్రదేశ్‌

ఉపాధి హామీ అమలులో అవార్డుల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సామాజిక భద్రత కార్యక్రామాల అమలు, ఉత్తమ పౌర సేవలకుగాను ఆంధ్రప్రదేశ్ మొత్తం 19 అవార్డులను అందుకొంది. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ జరిగిన కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ అవార్డులను అందజేశారు. 2015-16 సంవత్సరానికిగాను ఏపీ 19 జాతీయ స్థాయి అవార్డులను అందుకోగా, వీటిలో 3 రాష్టస్థ్రాయి, 2 జిల్లా స్థాయిలో, 4 మండల స్థాయిలో, 10 గ్రామ పంచాయతీ స్థాయి అవార్డులున్నాయి. రాష్టస్థ్రాయిలో దక్కించుకున్న అవార్డులను రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు, విజయనగరం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అందుకున్నారు. గ్రామీణావృద్ధి అదనపు కమిషనర్ జి.బాల సుబ్రహ్మణ్యం, విజయనగరం జిల్లా డ్వామా పూర్వపు ప్రాజెక్టు డైరెక్టర్ పి.ప్రశాంతి, గ్రామ పంచాయతీ విభాగం వైఎస్‌ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలం హిమకుంట్ల ఉపసర్పంచ్ కొమ్మ రమాదేవి, వార్డు సభ్యుడు కె.శివచంద్రరెడ్డి అందుకున్నారు. ఉపాధి హామీ పథకం అర్థిక నిర్వహణ పోస్టల్ విభాగంలో విశాఖ జిల్లా అనకాపల్లి డివిజన్ మొదగాడ పోస్ట్ మాస్టర్ ఎస్‌ఎం హరీశ్ కుమార్, రావికమతం పోస్ట్‌మాస్టర్ జిఎస్‌ఆర్ ఆంజనేయులు అవార్డులను అందుకున్నారు.

చిత్రం.. ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో సోమవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతుల మీదుగా అవార్డులు అందుకుంటున్న కలెక్టర్ వివేక్ యాదవ్, డ్వామా పూర్వపు పిడి పి ప్రశాంతి (విజయనగరం).