ఫోకస్

కార్పొరేట్ విద్యనేదే లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్పొరేట్ విద్య అనేదే లేదు.. విద్యాసొసైటీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుని కార్పొరేట్ స్థాయిలో విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. ఈ సొసైటీల బాగోతం ఏదోరోజు బయటపడుతుంది. పిల్లి మెడలో ఎవరో ఒకరు గంట కడతారు.. సామాజిక సేవాదృక్పథంతో నిర్వహిస్తామని సొసైటీల పేరుతో విద్యాసంస్థలను రిజిస్టర్ చేయించుకుని, రాయితీలు పొందుతూ విద్యావ్యాపారాన్ని సాగిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో కార్పొరేట్ విద్య అనేదే లేదు. అంతా సొసైటీల పేరుతోనే నడుస్తోంది. ఈ ప్రైవేటు విద్యావ్యవస్థలోని లొసుగులు బయటపడతాయి. పెద్ద పెద్ద వాళ్లంతా ఈ వ్యవస్థలో వేళ్లూనుకున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో ఫీజుల వ్యవహారం కాస్తా ఇష్టారాజ్యంగా నడుస్తోంది. నియంత్రణ అనేది కన్పించడంలేదు. సామాన్యుడు ఉన్నత విద్యను అందుకునే పరిస్థితి లేదు. ప్రైవేటుకు దీటుగా అంటూ ప్రభుత్వమే కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తున్నట్టుగా వుంది. పరోక్షంగా ప్రైవేటు విద్యకు ప్రభుత్వమే ప్రాధాన్యత కల్పిస్తున్నట్టుగా వుంది. ఒకపుడు ప్రభుత్వానికి పోటీగా ప్రైవేటు విద్య మొదలై, ఇపుడు ప్రైవేటుకు పోటీగా ప్రభుత్వ విద్య అన్నట్టుగా తయారైంది. ఈ ధోరణి మారాల్సి వుంది. ఆయా సంస్థల డిమాండ్‌ను బట్టి ఫీజులను గుంజుతున్న పరిస్థితి దాపురించింది. ప్రైవేటు విద్యాసంస్థల డిమాండ్‌ను బట్టి ఎంత ఫీజు పెడితే అంత ఫీజూ తల్లిదండ్రులు కట్టాల్సిందే. చదువు చెప్పే విధానానికి గానీ, ఫీజులపై నియంత్రణ గానీ లేదు. మార్గదర్శకాల ప్రకారం ప్రైవేటు విద్యా ప్రమాణాలు అందుతున్నాయో లేదో పర్యవేక్షించే వ్యవస్థ పాలకుల తీరుతో నిర్వీర్యమైపోయింది. ఫీజులను, ఇతరత్రా కాంపౌండ్ ఫీజులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులకు విద్యాహక్కు చట్టంపై అవగాహన కల్పించాల్సివుంది. సొసైటీల పేరుతో విద్యా సంస్థలను రిజిస్టర్ చేసుకుని బరితెగించిన విద్యావిధానాన్ని నియంత్రించాల్సివుంది. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన అవసరం దేశానికి చాలా అవసరం. తల్లిదండ్రులు వేధింపులకు గురికాకుండా చూడాల్సివుంది. విద్యా లోపాలు లేకుండా చూడాల్సివుంది. విద్యార్థుల మనసు గాయపడకుండా చూడాలి. ఫీజులు చెల్లిస్తున్న తల్లిదండ్రులకు, విద్యార్థుల మధ్య యాజమాన్యాలకు జవాబుదారీతనం ఉండేలా చూడాలి. చివరిగా ఒక మాట ఏదో రోజు ప్రైవేటు విద్యాసంస్థలు నిర్వహిస్తున్న వారంతా జైలుకెళ్లే పరిస్థితి వస్తుంది. సామాజిక సేవా దృక్పథంతో పనిచేస్తామని రిజిస్ట్రేషన్ చేయించుకుని లాభాల వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ప్రైవేటు విద్యావిధానంలో లొసుగులన్నీ ప్రభుత్వానికి తెలియనివి కాదు. బస్సుల వ్యవహారాన్ని నాని బయట పెట్టినట్టే ఏదో రోజు ఎవరో ఒకరు సొసైటీల భాగోతాన్ని బయట పెడతారు.
- ఉండవల్లి అరుణ్‌కుమార్
మాజీ ఎంపీ, రాజమండ్రి