రాష్ట్రీయం

యోగను పాఠ్యాంశం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: ప్రతి పాఠశాలలో యోగను పాఠ్యాంశంగా చేర్చాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. విద్యార్థి దశ నుంచే యోగ అలవాటు చేస్తే మంచి ఆరోగ్యంగా ఉంటారని ఆయన తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి అందిస్తున్న యోగ మనకు ఒక వరం వంటిదని అన్నారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వవ్యాప్తం చేస్తున్నారని కొనియాడారు. బుధవారం నాడిక్కడ గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగ దినోత్సవంలో కేంద్రమంత్రి దత్తాత్రేయతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగ క్రమశిక్షణకు మారుపేరు అన్నారు. మనస్సును స్థిరంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరు యోగ సాధన చేయాలని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ నమాజ్‌లోనూ యోగా ఉందని, క్రమం తప్పకుండా నమాజ్ చేసేవారు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రపంచం మొత్తం యోగ వైపు చూస్తోందని, మనపూర్వీకులు ప్రార్థనల్లో సైతం యోగను జోడించారని అన్నారు. ఇంకా మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరెకపూడి, గువ్వల బాలరాజు, గచ్చిబౌలి కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు.
రాజ్‌భవన్‌లో
నిత్య జీవితంలో యోగాభ్యాసం ఒక భాగంగా చేసుకోవాలని గవర్నర్ నరసింహన్ అన్నారు. యోగ ద్వారా మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారని తెలిపారు. బుధవారం రాజ్‌భవన్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో గవర్నర్ ప్రసంగించారు. మంచి ఆరోగ్యం, శరీర దారుఢ్యానికి, మానసిక ప్రశాంతతకు యోగ ప్రక్రియను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని అన్నారు. యోగాభ్యాసం అనేది చాలా సులభమని, నేర్చుకునేందుకు కూడా చాలా తక్కువ సమయం పడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజూ 10 నుంచి 15 నిమిషాలపాటు యోగాభ్యాసంలో భాగంగా ప్రాణయామం, బ్రీతింగ్ ఎక్స్‌ర్‌సైజ్‌లు చేస్తే మంచి ఆరోగ్యంతో పాటు మానసికంగా బాగుంటుందని తెలిపారు. రాజ్‌భవన్‌లో జరిగిన యోగ దినోత్సవంలో యోగ గురువు రవికిషోర్ ఆధ్వర్యంలో యోగాసనాలు నిర్వహించారు. దీనిలో సిబ్బంది, పోలీసు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.
టిసి పార్డు ఆధ్వర్యంలో
ఏకాగ్రతతో విజయపథంలో పయనించేందుకు యోగ దిక్సూచిగా పని చేస్తుందని టిసిపార్డు జాయింట్ డైరక్టర్ బి.నరేంద్రనాథ్ రావు అన్నారు. ప్రతి ఒక్కరూ యోగపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. యోగా గురువు కోటేశ్వరరావు ఈ కార్యక్రమంలో యోగ శిక్షణ అందించారు. ఇలా ఉండగా, జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ (ఎన్‌ఐఆర్‌డిపిఆర్)లో యోగ దినోత్సవం నిర్వహించారు. జీవనశైలిలో యోగకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సంస్థ డైరక్టర్ జనరల్ డాక్టర్ డబ్ల్యుఆర్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు.
బిజెపి యువమోర్చ ఆధ్వర్యంలో
సంజీవయ్య పార్కులో బిజెపి ఏర్పాటు చేసిన ప్రత్యేక యోగ కార్యక్రమంలో కూడా బండారు దత్తాత్రేయ మాట్లాడారు. ప్రపంచం మొత్తం యోగను పాటించేలా చేయడంలో ప్రధాని విజయం సాధించారని అన్నారు.