సబ్ ఫీచర్

గోల్ఫ్ ఆడేద్దాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది హైదరాబాద్ నగర నడిబొడ్డున పచ్చటి మైదానం. స్వచ్ఛమైన గాలి వీస్తున్న ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో మహిళలు గోల్ఫ్ ఆట ఆడుతుంటే ఎలా ఉంటుంది. చూడముచ్చటగా ఉంటుందనుకుంటున్నాం. గోల్ఫ్ ఆట అంటే అది మగవాళ్లు ఆడేది అనే నానుడికి స్వస్తిపలుకుతూ ఇపు డు ఆడవాళ్లు గోల్ఫ్ ఆడుతున్నారు. ఆ ఆటలో శిక్షణ తీసుకుంటున్నారు. అం తర్జాతీయ స్థాయి పోటీ ల్లో విజేతలవుతున్నారు. వీరిలో జొన్నల రమాదేవి ఒకరు. ఈమె శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ గోల్ఫ్ టోర్నమెంట్‌లో పాల్గొ ని ఎన్నో ఏళ్ల తరువాత ఓ మహిళా విజేతగా నిలిచారు. ఇంకా ఈ ఆట ఆడే ఇంద్రాణి అలీఖాన్, చైతన్యరెడ్డి వంటివారు ఈ ఆట తమ జీవితంలో ఓ భాగమైందంటున్నారు.
ఆసక్తి ఎలా కలిగింది..
గోల్ఫ్ అట పట్ల ఆసక్తి ఎలా కలిగిందని అడిగితే.. హైదరాబాద్‌లో సెటిల్ అవ్వకముందు రమాదేవి కువైట్‌లో ఉన్నారు. అక్కడ ఉన్నపుడు ఖాళీ సమయాన్నంతా వృథాగా గడపాల్సి వచ్చేది. ఓసారి అనుకోకుండా సహారా గోల్ఫ్ కోర్సుకు ఆమె వెళ్లారు. అక్కడ మగవాళ్లు గోల్ఫ్ ఆట ఆడటం చూసి ఇష్టపడటం జరిగింది. ఆ ఆట నేర్చుకోవాలనే పట్టుదల కలిగి దాదాపు ఐదేళ్ల పాటు కష్టపడింది. ఆమె శ్రమకు తగ్గట్లే అందులో నిష్ణాణితురాలైంది. కుమార్తను గోల్ఫ్ ఆట తరగతులకు తీసుకువెళ్లి.. అక్కడ ఆమె ఆటను చూసి ముచ్చటపడి చైతన్యరెడ్డి సైతం ఆటను నేర్చుకోవటం ఆరంభించారు.
లాభాలెన్నో..
ఈ ఆట వల్ల రోగాలు దరిచేరవు. పనిలో ఆనందం దక్కుతుంది. కొత్త గేమ్ ఆడాలనే ఉత్సాహాన్ని నింపుతుంది. అంతేకాదు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ్డాయని జొన్నల రమాదేవి చెబుతున్నారు. రమాదేవితో పాటు గోల్ఫ్ ఆట ఆడే మరో పార్టనర్ అలీఖాన్ మాట్లాడుతూ.. ఆరేళ్ల నుంచి ఈ ఆట అడుతున్నాను. నేర్పు, సహనం అనే గుణాలు అలవడ్డాయని, అతివలకు ఈ రెండూ గుణాలు ఉంటే ఎందులోనైనా రాణించగలుగుతారని అంటారు. గైడెన్స్ లేకుండా ఆ ఆట ఆడలేమని, నిష్ణాణితులు కాలేరని ఆమె అభిప్రాయం. కేవలం ఆసక్తితో ఆరంభించిన ఈ ఆట ఇపుడు ఈ ముగ్గురు జీవితాల్లో ఓ భాగమైందని చెప్పవచ్చు. గోల్ఫ్‌ను గత 18 ఏళ్ల నుంచి ఆడుతున్న షర్మిలారెడ్డి ఇందులో లభించే తృప్తి మరే ఆటలోనూ దక్కదని అంటారు. చదువుకునే వయసులో బాస్కెట్‌బాల్, క్రికెట్, స్కాష్ ఆటలు ఆడేదాన్ని.
కాని ఈ ఆటలకంటే గోల్ఫ్ ఉత్తేజాన్ని, మానసిక తృప్తిని అందిస్తుందంటారు షర్మిలాలెడ్డి. శైలారెడ్డి కుటుంబ సభ్యులంతా గోల్ఫ్ ఆట ఆడతారు. భర్త ఆడుతుంటే చూడటానికి వచ్చి ఆమె కూడా ఈ ఆట నేర్చుకున్నారు. గత నాలుగేళ్ల నుంచి ఆమె ఈ ఆట ఆడుతున్నారు.

గోల్ఫ్ గురువు
గోల్ఫ్ ఆట ఆడాలనే అభిలాష ఉన్నవారు కోచింగ్ తీసుకోవటం ఉత్తమం. ఇదే విషయాన్ని కోచ్ గంగాధర్ నొక్కి వక్కాణిస్తారు. సైన్యంలో కమాండర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన గంగాధర్ అమెరికాలోని గోల్ఫ్ అకాడమీలో గ్రాడ్యూయేషన్ చేశారు. ఈ గోల్ఫ్ గ్యారేజీలో ఎంతోమంది నిష్ణాణితులు తయారయ్యారు. గోల్ఫ్ నేర్చుకునేవారిక శిక్షణ ఇవ్వటాన్ని ఎంతో ఇష్టపడతారు. అర్షదీప్ తివానా, సందీప్ సాయల్, జోసఫ్ వంటివారు గంగాధర్ చేతిలో గోల్ఫ్ క్రీడలో తీర్చిదిద్దబడినవారే. పదహారేళ్ల క్షితిజ్ కౌల్, ప్రణయ్‌లను తీర్చిదిద్దారు. వీరిలో ప్రణయ్ కొయంబత్తూర్‌లో జరిగిన దక్షిణ జోన్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచారు. కమాండర్ గంగాధర్‌కు అన్ని వయసులవారికి గోల్ఫ్ శిక్షణ ఇవ్వటం అంటే ఇష్టం. ఈ ఆటలో అనేకమందిని నిష్ణాణితులుగా తీర్చిదిద్దటానికి ఆయన నిరంతంరం తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంటారు.