డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ - 40

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేవలం పిల్లలను ప్రొటెక్ట్ చేయాలన్న అమ్మ మనసు తప్ప.
గబగబా పిల్లకు పెట్టే పని నేను తీసుకుని తల్లికి వేలితో చూపించాను తనని ముందు పెట్టుకోమని. విమానం ఎక్కినపుడు ఎయిర్ హోస్టెస్ ప్రమాదకరమయిన సందర్భాలలో ఏం చేయాలో వివరిస్తున్నపుడు అనుకున్నాను- నిజంగా ఎమర్జెన్సీలో ఇవి వాడాల్సి వస్తే ఏదైనా గుర్తుంటుందా అని.. కాని, చిత్రం అందరూ విన్నారు. అందరూ ఫాలో అవుతున్నారు.
ప్రాణం అంటే అంత తీపి కాబోలు. సబ్‌కాన్సియస్‌గా అందరూ ప్రాణరక్షణకు కావాల్సిన కిటుకులు గ్రహిస్తారు కాబోలు. జరుగుతున్నది కెప్టెన్ వివరించాలని మైకులో మాట్లాడుతూనే ఉన్నాడు. కాని ఆ క్షణంలో విమానంలో కోలాహలం పూర్తిగా అర్థం కావడంలేదు.
గ్రహించగలిగినదేమంటే చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి పెద్ద స్టారమ్ వచ్చింది. కెప్టెన్ చాలా జాగ్రత్తగా నడుపుతున్నాడు. 400 జీవితాలు అతని చేతిలో ఉన్నాయి. విమానం మాత్రం ఎప్పుడూ కంటే బాగా ఊగుతోంది. మనసంతా భయం ఆవరించింది. ఎంతగా స్మరిద్దామనుకున్నా ఒక్క భగవత్ శ్లోకం గుర్తుకు రావటంలేదు.
ఒక్క భగవత్ రూపం సాక్షాత్కరించడం లేదు. ఎప్పుడూ వెన్నంటి వచ్చే మా కనకదుర్గ ఏమయింది? అనుకుంటూ ఆవిడ స్తోత్రం చదవాలని ఎంతగానో ప్రయత్నించాను. మొదటి లైను దాటడంలేదు.
కళ్ళముందు వౌళి కనిపించాడు. అమ్మా నాన్న కనిపించారు. అన్నయ్య, వదిన కనిపించారు. ఈ విమానంకి ఏదైనా ప్రమాదం జరిగితే మళ్లీ వాళ్ళంతా ఎంత సంక్షోభానికి గురి అవుతారు అనిపించింది.
అదేం ఖర్మమో గాని, అమ్మా, నాన్నకి నా వైపు నుంచి ఎప్పుడూ చింతే తప్ప సంతోషం, సంతృప్తి కలగలేదు. జన్మనిచ్చిన అమ్మా, నాన్న, ఆత్మస్థైర్యం ఇచ్చిన అన్నయ్య, వదిన, ఆశరేకెత్తించిన వౌళి, వాళ్ళ మొహాలే కళ్ళముందు మెదలసాగాయి. అయ్యో, మళ్లీ వాళ్ళకు నా మూలంగా గర్భశోకం- వౌళికి తండ్రి ఎప్పుడూ తెలియదు, ఇప్పుడు నేను కూడా! అయ్యయ్యో వాడి పెళ్లి కూడా ఆగిపోతుందేమో.
అంత భయంకరమయిన సందర్భంలోనూ నా మనసు చిలవలు పలువలు అల్లేస్తూనే ఉంది.
ఊగిసలాడుతున్న విమానం ముందుకు వెడుతూనే ఉంది. అక్కడ ఎక్కడా ఎమర్జెన్సీ లాండింగ్ చేసే ప్రదేశంకాదు, అట్లాంటికక్ సముద్రం మీంచి పోతోంది.
ఎప్పుడో పూర్వం ఒకసారి, పాతిక, 30 ఏళ్ళ క్రితం ఎయిర్ ఇండియా వాళ్ళ విమానం ఆల్ఫ్ వౌంటెన్స్‌లో కూలిపోయింది. ప్రసిద్ధ సైంటిస్ట్ డా.బాబా కూడా అందులో అంతరించిపోయారు.
ఈ విమానంలో ఎవరెవరు ఉన్నారో, ఇది కూడా ఒక చరిత్రలా నిలిచిపోతుందేమో! నాలాంటివారు ఎవ్వరికీ తెలియదు. ఏటి ఒడ్డున గడ్డి పరకలు.
బలంగా నిట్టూర్చాను. ప్రయాణిస్తున్న ప్రతి క్షణం, పాత గడియారపు ముల్లులా తెలుస్తోంది. చేతులన్నీ చెమ్మగిల్లాయి. నుదురంతా చెమట పట్టేసింది. వెన్నులో ఏదో బలహీనత పాకుతోంది. కడుపులో కవ్వం పెట్టి తిప్పిన్నట్లులా ఉంది.
భగవంతుడా, ఇదే నా తుది రోజయితే- నాది ఒక్కటే ప్రార్థన. నా కుటుంబాన్ని చల్లగా చూడు. సర్వే జనాః సుఖినోభవంతు!
మళ్లీ మనసు సర్వే జనాః మీదకు వెళ్లిపోయింది. ఎంత నిస్వార్థమైన స్వార్థచింతన. జనులందరూ సుఖంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. కానీ, మళ్లీ ఆ జనులందరిలోనూ నా వారు కూడా ఉంటారు!
ఏమిటిది? నా మనసుకు ఏమీ పిచ్చి ఎక్కడం లేదు కదా! నేను చచ్చిపోబోతున్నాన్న భయం రావడంలేదేమిటి? అంటూ తల తిప్పి అందరి వంకా చూడాలని ప్రయత్నించాను. లైట్లు బాగా డిమ్ చేయడంతో మొహాలు వివరంగా తెలియడంలేదు. కానీ, అందరూ ఆందోళనగా ఉన్నారని తెలుసు. పసి పిల్లలు బాగా ఏడుస్తున్నారు. ప్రెషర్ డ్రాప్ అవడంతో చెవులు బాగా పోటు కలిగిస్తున్నాయేమో!
ఆ టైములో నాకు నా వారెవ్వరినీ చూడాలన్న కోరిక కలుగలేదు. కేవలం వాళ్ళంతా క్షేమంగా ఉండాలన్న కోరిక తప్ప.
ఆ హడావుడి అంతా ఒక్క అరగంట.
30 నిమిషాలు...
1800 సెకన్లు. కానీ, ప్రతి సెకను చాలా భయంకరంగా అనిపించింది.
ఇంతలో ప్రపంచంలో అంతకంటే మరో మంచి వార్త ఉంటుందా అన్నంత చక్కని వార్త వినిపించింది కెప్టెన్ గొంతులోంచి- స్టారమ్ తగ్గుతోందని. ఇక భయపడవలసింది లేదని.
అందరి దగ్గరనుండి రకరకాల భాషల్లో, మతాల్లో- కృతజ్ఞతలు, ప్రార్థనలు వినిపించాయి.
****
విమానం న్యూయార్క్ చేరింది.
ప్రయాణం అంతా ఒక ఎత్తు అయితే, చివర అరగంట ఒక ఎత్తు. మొదట టైం ఎక్కడికి పోతోందో తెలియనిది చివరకు వచ్చేసరికి అసలు టైం గడుస్తుందా అన్నట్లయింది. నా పక్కన ఉన్న అమ్మాయి చాలా భయపడిపోయింది. కెప్టెన్ అనౌన్స్‌మెంట్ వినగానే ఒక్కసారిగా ఏడ్చేసింది. ఒంటరిగా వస్తోంది చిన్న పిల్లతో- ఆ అమ్మాయిని ఓదార్చే పనిలో నా వర్రీ గురించి మరచిపోయాను.
కాళ్ళు స్ట్రెచ్ చేసుకుని హ్యాండ్ బ్యాగ్ భుజాన వేసుకుని బయటకు వచ్చేటప్పటికి అక్కడ చాలామంది వెయిట్ చేస్తూ కనిపించారు.
తొలిసారిగా అమెరికా నేలమీద అడుగు మోపుతుంటే ఏదో తెలియని భావం మెదిలి అనుకున్న దానికంటే ఎన్నో ఏళ్ళు ఆలస్యంగా, అనుకున్నవారికోసం కాకుండా, కొడుకు కోసం వస్తున్నాను. ప్రయాణికులంతా పెద్ద క్యూలో నుంచుని ఉన్నారు. కస్టమ్స్ అన్ని ఫార్మాలిటీస్ ముగించుకుని బయటకు వచ్చేటప్పటికి మరో అరగంట దాటిపోయింది. నా పాస్‌పోర్ట్, వీసా అన్నీ చూస్తున్న ఆఫీసర్ అడిగాడు, ‘అమెరికా రావడంలో నా పర్పస్ ఏమిటి’ అని. వాడి యాక్సెంట్ అర్థం కావడానికి కొద్ది క్షణాలు పట్టింది. మొత్తం వాక్యంలో అర్థమయిన పదం పర్పస్ అన్నదొక్కటే..
‘‘టు అటెండ్ మై సన్స్ మారేజ్’’ అన్నాను.
‘‘హౌ ఎగ్జైటింగ్!’’ అంటూ పాస్‌పోర్ట్ తిరిగి ఇచ్చేశాడు. ‘‘హావ్ ఎ వండర్‌ఫుల్ విజిట్’’ అన్నాడు.
‘‘్థంక్ యూ!’’ అంటూ అందుకున్నాను. అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా ప్లెజెంట్‌గా మాట్లాడుతున్నారు. ఎంతో స్నేహపూర్వకంగా ఉన్నారు. చాలా హాయిగా అనిపించింది. అందులో ముఖ్యంగా వెంట్రుకవాసిలో తప్పిపోయిన ప్రమాదం హఠాత్తుగా కళ్ళు తెరిపించింది. ఈ క్షణమే నీది! మరో క్షణంలో ఏముందో- బి థాంక్‌ఫుల్ ఫర్ వాట్ యూ హావ్! ఉన్నదానికి సంతోషించు, లేనిదానికి విచారించకు. చేతిలో ఉన్నది చేయి జారితే అందుకోవడానికి అర్రులు చాచకు.
ఎంత క్లుప్తమయిన సందేశం. ఈ ఒక్కటి అర్థం చేసుకుంటే చాలు. జీవితం అంటే అర్థం చేసుకోవడానికి, సంతోషంగా బతికేయడానికి.
కస్టమ్స్‌లోంచి బయటకు వచ్చాను. అక్కడ చాలామంది చాలా స్ట్రెస్‌డ్‌గా కనిపించారు. అంతమందిలో అటూ ఇటూ చూసేసరికి చేతులు ఊపుతూ వౌళి, వాడి పక్కనే తేజ నిలబడి ఉన్నారు.
వాడి మొహంలో కనిపించాల్సినంత ఆనందం కనిపించలేదు. చాలా వర్రీగా కనిపించాడు. ఆ వర్రీతోపాటు కొంచెం రిలీఫ్ కూడా కనిపించింది. నన్ను చూడగానే రెండు అడుగులు ముందుకువేసి గట్టిగా హగ్ చేశాడు. వాడేం మాట్లాడకపోయినా నేను గ్రహించాను.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి