Others

అరచేతిలో అందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరింటాకు ఇష్టపడని మహిళలు చాలా అరుదు. పండుగలైనా..్ఫంక్షలైనా ముందుగా ఆడవారు గోరింటాకుకే ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడంటే మార్కెట్లో పౌడర్లు, కోక్‌లాంటివి రెడిమేడ్‌గా దొరుకుతున్నాయి. కాని, ఇదివరకటి రోజుల్లో ప్రతి ఇంటి పెరిట్లో గోరింటాకు చెట్టు తప్పనిసరిగా ఉండేది. ఆషాఢంలో గోరింటాకుకు చాలా ప్రత్యేకత ఉంది. ఆషాఢమాసం వచ్చేస్తోంది..అనగానే ఆడవారి అరచేతులు గోరింటాకుతో అందంగా మెరిసిపోతుంటాయి. ఈమాసంలో గోరింటాకు పెట్టుకునే ఆచారం మన సంస్కృతిలో ఉంది. అసలు దీని వెనుక ఉన్న మర్మమెందో మీకు తెలుసా...ఆషాఢమాసం గ్రీష్మరుతువు పూర్తిగా వెళ్లిపోయి వర్షరుతువు ప్రారంభమవుతుంది. గ్రీష్మంలో మన శరీరం బాగా వేడి పెరుగుతుంది. ఆషాఢంలో బయట వాతావరణం చల్లబడిపోతుంది. మన శరీరంలో ఉన్న వేడి, బయట చల్లబడిన వాతావరణం పరస్పర విరుద్దం కాబట్టి అనారోగ్యాలు మొదలవుతాయి. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి ఉంది. అంతేకాదు రోగనిరోధకశక్తిని పెంచుతుంది. అందువల్లే మన ప్రాచీనులు గోరింటాకు ఆషాఢమాసంలో తప్పకుండా పెట్టుకోవాలని చెబుతారు. కాబట్టి మహిళలు ఆషాఢమాసంలో అందంతోపాటు ఆరోగ్యాన్నిచ్చే గోరింటాకును అరచేతుల నిండా నింపుకోవాలి. మార్కెట్‌లో దొరికే కోక్, పౌడర్లకంటే గోరింటాకు చెట్టు నుంచే ఆకులు తెంపుకొని పెట్టుకునేందుకు ప్రయత్నించండి.

- హెచ్.ఉమాశంకర్, నాగర్‌కర్నూల్