డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ - 42

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘హాయ్ మామ్! యా, వచ్చారు. అంతా బాగానే జరిగిందట. స్నానానికి వెళ్లారు.
మామ్! నువ్వు నమ్మవు- షి ఈజ్ ఏవ్‌సమ్! వౌళికి మామ్‌లాగానే లేరు. ఇంగ్లీష్‌లో గబగబా మాట్లాడేస్తోంది. అవతల వైపు నుంచి వాళ్ళమ్మ ఏదో అందనుకుంటాను. తేజ టక్కున మానేసింది.
‘‘లేదు, ఆవిడ మందు అనలేదు’’ తరువాత నేను ఫోన్ చెయ్యమని చెప్తాను అని పెట్టేసింది.
నేను బయటకు వచ్చేసరికి వౌళి, తేజ టేబుల్‌మీద భోజనానికి సిద్ధం చేస్తున్నారు. నాతో తెచ్చిన స్వీట్స్, ఊరగాయలు తీసి వాళ్ళకిచ్చాను.
వావ్ అనుకుంటూ అన్నీ అందుకున్నారు. కబుర్లు చెప్తూ ముగ్గురం భోజనానికి కూర్చున్నాం.
‘‘అమ్మ చెప్పినవన్నీ కొని తెచ్చి అక్కడ పెట్టాను మీ కోసం. మీకు ఇంకేమయినా కావాలంటే చెప్తే తెచ్చిపెడతాను’’ అంది తేజ.
వౌళి చెప్పాడు. తేజ వాళ్ళమ్మ చాలా విషయాలలో ఎంతో ఖచ్చితంగా చెప్తుందిట. నేను రావడం తెలియగానే, కూతురికి ఫోన్ మీద ఫోన్ చేస్తూ సూచనలు ఇస్తూనే ఉందిట.
‘‘నీ సంగతెలా ఉన్నా, వాళ్ళమ్మ అత్తగారంటే హడలుపోయేట్టు చేసేసింది’’ అన్నాడు వౌళి. చేతిమీద చిన్నగా ఒక దెబ్బ వేసింది తేజ చిరుకోపంతో.
వాళ్ళను చూస్తే నాకు చాలా ముచ్చటగా అనిపించింది. వాళ్ళు త్వరలో పెళ్ళి చేసుకునేవాళ్ళలా కనిపించలేదు. ఎంతో కాలంగా పరిచయం ఉన్నట్లుగా ఉన్నారు.
బంగళా దుంపల వేపుడు, సాంబార్ అన్నీ చాలా బాగున్నాయంటూ భోజనం ముగించాను. మనసు, శరీరం ఎంతో బడలిక పొందినట్లుగా అనిపిస్తోంది. ముందు ప్రయాణం గురించి ఆందోళన, ఏర్పాట్లు, షాపింగ్, రెండు నెలల నుంచి ఒకే ఆలోచనతో గడిచిపోయింది. అన్నీ మించి ప్రయాణంలో హడావడి. నాకే ఏమిటోగా అనిపిస్తోంది వాళ్ళతో ఈ అపార్ట్‌మెంట్‌లో ఉండటం.
పుట్టి పెరిగాక జీవితం మొత్తంమీద అమ్మా నాన్నలతోనే గడిచింది. పోయిన కొద్దికాలం నుంచి నేను ఉద్యోగం చేసే ఊరిలో ఒంటరిగా ఉంటున్నాను. నాకు మరి మూడో మనిషితో కలిసి ఉండాల్సిన అవసరం రాలేదు. ఎంత కొడుకయినా వాడింట్లో ఉండటం తమాషాగా అనిపించింది.
నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో వేరే ప్లాట్ తీసుకుని ఉందామని చాలా ప్రయత్నాలు చేశాను. కాని ఇంట్లో వాళ్లు నేను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడలేదు.
పైగా మామ్మ వాళ్ళంతా వౌళి ఎదగాల్సిన కుర్రాడు. అది వాడికి మంచిది కాదు అని బాగా నిరుత్సాహపరిచేవారు. దానితో వాళ్ళతోనే ఉండిపోయాను. ఇప్పుడు వౌళితో వాడింట్లో ఉండటం కొంచెం తమాషాగా అనిపిస్తోంది.
టెలిఫోన్ గణగణా మోగింది. వౌళి ఫోన్ తీసి నా చేతికిచ్చాడు. తేజ వంక చూపిస్తూ వాళ్ళ అమ్మగారు అంటూ. ఫోన్ అందుకున్నాను.
వెల్‌కమ్ కల్యాణిగారు, యుఎస్‌కి స్వాగతం అంటూ పలకరించింది తేజ అమ్మ సావిత్రి.
‘‘నవ్వుతూ థాంక్స్ అన్నాను. మీ అందరి తరఫునుండి మీ అమ్మాయి స్వాగతం పలికింది’’ అన్నాను.
‘‘త్వరగా వచ్చేయండి మా ఊరు. ఇద్దరం కలిసి పెళ్లి పనులు పూర్తిచేద్దాం’’. ఆవిడది చాలా కలివిడి స్వభావం. ఇంతకుముందు ఇండియా కూడా ఫోన్ చేసింది వౌళి, తేజ చెప్పగానే.
‘‘తప్పకుండా! ఇంకా అసలు ప్లాన్ ఏమిటో వౌళితో మాట్లాడలేదు’’ అన్నాను. ఆ తరువాత అవి ఇవి మాట్లాడి ఆవిడ ఫోన్ పెట్టేసింది.
ఆ తరువాత సంభాషణ అంతా నా ప్రయాణం, ఎదురైన ప్రమాదం గురించే సాగిపోయింది. నా తొలిసారి విమాన ప్రయాణం జీవితంలో మరిపోలేనిదిగా నిలచిపోయేటట్లుంది.
కెప్టెన్ అనౌన్స్‌మెంట్ నుండి ఆక్సిజన్ కప్స్ క్రిందకి జారడం భయంతో ప్రయాణీకుల స్పందన- విమానంలో స్ట్ఫా అంతా ఎంత సహాయం చేస్తూ కనిపించారో అన్నీ చెప్పాను. మరచిపోలేని అనుభవం. ఇక ముందు ఎప్పుడూ విమానం ఎక్కబోయినా ఈ అనుభవం గుర్తుకురాక మానదు.
వౌళి అడిగాడు ‘‘ఏమనిపించింది నీకు ఆ భయంలో? వాడి వంక చూశాను. వాడి కళ్ళల్లో ఆందోళన తొంగి చూసింది.
వాడి వంక చూస్తూ వాతావరణం తేలిక చెయ్యాలనిపించింది. ‘‘నిజం చెప్పనా! నాకు ముందుగా చచ్చిపోతానేమో అనే భయం కంటే, అమ్మమ్మ, తాతయ్యలకు నా మూలంగా ఎంత దుఃఖం అనుభవించాల్సి వస్తుందో’’ అని బాధేసింది.
‘‘నీ పెళ్లి వాయిదా పడిపోతుందేమో అని భయం వేసింది’’ అన్నాను వౌళి వంక చూడకుండానే, నా వేళ్లవంక చూసుకుంటూ.
‘‘అమ్మా!’’ అన్నాడు గట్టిగా నా భుజాల చుట్టూ చెయ్యి వేసి నొక్కుతూ!
నాకు తెలుసు నా మాటలు వాడికి సంతోషం కలిగించవని. నేను మానసికంగా డిటాచ్‌మెంట్‌కి ప్రయత్నిస్తున్నానని వాడికి నచ్చదు.
నా మొహం కాకపోతే కొడుకు గురించి అహర్నిశలు ఆలోచించే నాకు డిటాచ్‌మెంట్ ఎక్కడనుంచి వస్తుంది.
ఒకసారి నేను, వౌళి కలిసి బజారుకు వెళ్లాం. వాడికి 15, 16 సంవత్సరాలు ఉంటాయేమో! ఒక పెద్ద రోడ్డు దాటాలని అటూ ఇటూ చూసుకుని రోడ్డు దాటబోయాం. ఇంతలో ఎక్కడనుంచి వచ్చిందో పెద్ద లారీ చాలా స్పీడుగా వచ్చేస్తోంది. వౌళి నా చెయ్యి పట్టుకుని ఒక్కసారిగా పరిగెత్తాడు. రోడ్డు అవతల వైపుకు హడావిడిగా పరిగెత్తడంలో నా చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ రోడ్డుమీద పడిపోయింది. లారీ టైరు హ్యాండ్ బాగ్ మీంచి వెళ్లిపోయింది.
రోడ్డు అవతల గట్టుమీద నుంచున్న మేమిద్దరం ఒకరి మొహం ఒకరు చూసుకున్నాం. ‘‘‘అది నీ తల అయి ఉండేది!’’ అన్నాడు వౌళి నా చెయ్యి గట్టిగా పట్టుకుని భయంతో.
వాడి చేతిమీద మృదువుగా రాస్తూ- ‘‘ఏమీ అయ్యేది కాదు. నాకు ఏమీ అవ్వదు. నేనిప్పుడే చచ్చిపోవాలనుకోవడంలేదు. డోంట్ వర్రీ’’ అన్నాను నవ్వాలని ప్రయత్నిస్తూ. ‘‘అమ్మమ్మా, తాతయ్య బ్రతికి ఉన్నంతకాలం నాకు చచ్చిపోయే ఉద్దేశం లేదు’’ అన్నాను కాస్త వాతావరణం తేలిక పరచాలని ప్రయత్నిస్తూ.
‘‘వాళ్లిద్దరికీ నా మూలంగా ఎటువంటి సంతోషం కలగలేదు. నా మూలంగా దుఃఖం మాత్రం కలగనివ్వను’’ అన్నాను. నవ్వుతూ అన్నా దృఢంగా వినిపించి ‘‘మరి నా సంగతేమిటి?’’ అన్నాడు కోపంగా.
‘‘ఏమీ జరగలేదుగా! ఎందుకు అంత వర్రీ అవుతావు?’’ అన్నాను.
తేజ వెడతానని బయలుదేరింది. సబ్‌వే వరకు తను వస్తానని వౌళి లేచాడు.
తేజ ఉద్యోగం చేసేది దాదాపు 50 మైళ్ళ దూరం. ఆ అమ్మాయి ఆఫీసుకి దగ్గరగా అపార్ట్‌మెంట్ తీసుకుని ఉంటోంది. ఇక్కడ నుంచి అక్కడకు ఓ గంట పడుతుంది. అసలు న్యూయార్క్‌లో ఎక్కువమంది కార్లు వాడటరుట పార్కింగ్ దొరకదని.
నేను లేచి కిటికీ దగ్గరగా నుంచున్నాను. పైఅంత్తునుండి కింద రోడ్డు, మనుషులు, కార్లు హడావిడి అన్నీ కనిపిస్తూన్నాయి. సందు మలుపు దగ్గర వౌళి, తేజ ఒకరి చేతిని ఒకరు పట్టుకుని నడుచుకుంటూ కొంత దూరం వెళ్లి ఆగిపోయారు. ఇద్దరూ చాలా సేపు ఏదో మాట్లాడుతూనే నిలబడిపోయారు.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి