ఆంధ్రప్రదేశ్‌

పరిణతి చెందిన జగన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 1: ప్రతిసారీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు సంధించే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈసారి రాజకీయ పరిణతి ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్రంలో వివాదంగా మారిన గరగపర్రు ఘటన అనంతరం ఆ గ్రామానికి వెళ్లేందుకు అధికారపార్టీ ప్రముఖులే వెనుకాముందూ ఆలోచించి ఆ బాధ్యతను కలెక్టరుకు అప్పగించగా, జగన్ మాత్రం అక్కడికి వెళ్లి రెండు వర్గాలతో సామరస్య చర్చలు నిర్వహించడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ఆయన పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా వ్యవహరించారన్న అభిప్రాయం అన్ని పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది. గరగపర్రు వ్యవహారం నిజానికి అధికారపార్టీకి సంకటం కాగా, దానిని రాజకీయంగా సద్వనియోగం చేసుకునే అవకాశం ఒక ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ, జగన్ దానిని పక్కకుపెట్టి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించడాన్ని అన్ని వర్గాలూ ప్రశంసిస్తున్నాయి. ముందు బాధిత దళిత వర్గాల వద్దకు వెళ్లిన జగన్ గంటకు పైగా దళితవాడలో గడిపారు. వారి పిల్లలను తన ఒడిలో కూర్చోబెట్టుకుని, దళితులకు ధైర్యం చెప్పారు.
జరిగిన సంఘటన దురదృష్టకరమని, ఇకపై రెండు వర్గాలు కలసి ఉండాలని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత అగ్రవర్ణం వారితోనూ చర్చలు జరిపారు. పంతాలు, పట్టింపులకు వెళ్లకుండా ఇకపై అంతా కలసి ఉండాలని, కలసి జీవించడంలోనే ఆనందం ఉందని హితవు పలికారు. సహజంగా ఇలాంటి ఘటన జరిగినప్పుడు బాధితుల భావోద్వేగాల గురించే ఎక్కువగా మాట్లాడి, ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించే జగన్ ఈసారి ఎక్కడా అలాంటి ప్రయత్నం చేయకుండా హుందాగా వ్యవహరించి, కేవలం సమస్య పరిష్కారానికే పరిమితమవడం ఆయనలోని రాజకీయ పరిణతిని బయటపెట్టింది. తన పర్యటనలో ఎవరికీ అనుకూలంగా, ఎవరికీ వ్యతిరేకంగా నినాదాలు చేయవద్దని తన పార్టీ నేతలకు ముందుగానే హెచ్చరించడంతో, ఎవరూ దాని జోలికి వెళ్లకపోవడం కూడా జగన్ పర్యటన ప్రశాంతంగా మారింది. ఇదే ఘటనకు సంబంధించి ఏవిధంగా వ్యవహరించాలో తెలియక అధికార పార్టీలో అయోమయం నెలకొంది. ఏం మాట్లాడితే అక్కడి దళిత-అగ్రవర్ణాలు ఏవిధంగా ప్రతిస్పందిస్తాయన్న భయంతో, ఆ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను కలెక్టరుకు అప్పగించగా, జగన్ అలాంటి భయాలేవీ లేకుండా రెండు వర్గాలను కలిపేందుకు చేసిన యత్నం రాజకీయ వర్గాల ప్రశంసలు అందుకుంది.