త్వరలో వాసుకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నయనతార ప్రధాన పాత్రలో మలయాళంలో రూపొందిన చిత్రం ‘పుదియ నియమం’ ఈ చిత్రాన్ని తెలుగులో వాసుకిగా అనువదిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన నటనకు నయనతారకు ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు రావడం విశేషం. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడే ఓ స్ర్తి కథాంశంతో ఈ సినిమా రూపొందింది. శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్‌ఆర్‌మోహన్ అందిస్తున్న ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ మళయాళంలో సెనే్సషన్ హిట్ సాధించిందని, రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌కు ప్రేక్షకులనుండి మంచి ఆదరణ లభించిందని తెలిపారు. ప్రస్తుతం సమాజంలో వున్న సమస్య సినిమాలో చర్చించడంతో సినిమాపై మంచి అంచనాలు, క్రేజ్ ఏర్పడిందని, త్వరలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.