Others

ఫ్యాషన్ ‘పండు’గ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేరణ స్పందిస్తే సృజన ఆవిష్కృతమవుతుంది. అసలు ఫ్యాషన్ అంటే గుర్తొచ్చేది ప్రకృతే. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో ఆవిష్కరణలు ప్రకృతిలోని ఎన్నో విశేషాలని అనుకరించిన మన ఫ్యాషన్ డిజైనర్లు ఇప్పుడు పండ్లు మీద తమ కనే్నశారు. ఉంగరాలు, గొలుసులు, పెండెంట్లు, నెక్లెసులు, చైనులు, క్లిప్పులు, శారీపిన్నులు, చెవిరింగులు- ఇలా ఫ్రూట్స్‌ని ఎన్నో రకాల అభరణాల్లో ఒదిగేలా తీర్చిదిద్దుతున్నారు. ఫంకీ జ్యూయలరీలో ఫ్రూట్ మోడల్స్‌కి లోటేలేదు. స్ట్రాబెర్రి, గ్రీస్ పియర్స్, చెర్రీలు, నారింజ ఇలాంటి ఎన్నో పండ్లకి లాకెట్లకి రూపాలొచ్చేసి మార్కెట్‌లో తమదైన ముద్రని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా ద్రాక్షపండ్ల గుత్తులతో మతులు పోగొట్టే నెక్లెసులు పార్టీవేర్‌గా నవీన రూపాన్ని సంతరించుకున్నాయి. వాటర్ మిలన్, చెర్రీ, ద్రాక్ష, మామిడి, అరటి, దానిమ్మ తరహా పండ్లు ఆరోగ్యానే్న కాదు పార్టీవేర్‌గా అందాన్నీ అందిస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవన వైవిధ్యానికీ, ప్రశాంతతకీ కేరాఫ్ అడ్రస్ ప్రకృతిలోని రంగులు. నిమ్మ, చెర్రీ, ఆపిల్ వంటి పండ్ల ఆకారాల్లో చేసిన బ్రేస్‌లెట్లుకి పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు విపరీతమైన క్రేజ్. మరి ఈ పండుగను ఇక్కడా ఫాలో అయితేపోలా!!

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి