Others

సంగీతంలో సిసింద్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది ప్రపంచ సంగీత దినోత్సవం. ఈ సందర్భంగా సంగీత కచేరి ఏర్పాటుచేశారు. వాయిద్యకారులు అంతా సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా పాతికేళ్లుదాటినవారే. వారి మధ్య ఓ పదేళ్ల బుడతడు కూడా ఉన్నాడు. డ్రమ్స్ ముందు నిలబెడ్డాడు. పక్క వాయిద్యకారులు కూడా సందేహంగా ఆ పిల్లాడి వంక చూస్తున్నారు. పాటకు అనుగుణంగా వాయించగలడా అని సందేహిస్తున్నారు. వీక్షకుల ఆశ్చర్యాన్ని, తోటి వాయిద్యకారుల సందేహాలను పటాపంచలు చేస్తూ ఆ చిన్నారి ఆ సంగీతోత్సవంలో ల యబద్దంగా అందించిన నేపథ్య సంగీతం అక్కడున్న అందరి ప్రశంసలు అందుకోవటంమే కాదు వారి హృదయాలను తాకింది. ఆ చిన్నారి పేరు అర్నవ్ కుప్పాచి. డ్రమ్స్ వాయిద్యాలంటే ఎనలేని మక్కువ. అతను మాట్లాడుతుంటే ఆ మాటల్లో ఎంతో ఆత్మవిశ్వాసం దాగి ఉంటుం ది. అంత చిన్న వయసులోనూ తానేమి అవ్వాలనుకునే విషయంలో స్పష్టత దాగి ఉంటుం ది. డ్రమ్స్ వాయిద్య సంగీతం అంటే అతనికి ప్రేమ.
కన్నవారి ప్రోత్సాహంతోనే..
తల్లిదండ్రులు ప్రోత్సాహంతో అర్నవ్ హైదరాబాద్ సిటీలో ప్రము ఖ సంగీతకారుల సరసన పిన్న వయసులోనే చేరాడు. చిన్నప్పటి నుంచి లయబద్దమైన సంగీతాన్ని కనబర్చేవాడు. ఇది గ్రహించిన తల్లిదండ్రులు అత డ్ని ప్రోత్సహించారు. సంగీతంలో శిక్షణ ఇప్పించారు. అంతేకాదు అతను చది వే స్కూల్లో కూడా ఈ చిన్నారి సంగీతం అంటే టీచర్లు, విద్యార్థులకు ఎంతో ఇష్టం. అర్నవ్ ప్రతిభను గమనించి స్కూల్లోని మ్యూజిక్ టీచర్లు సైతం వివిధ సంగీత వాయిద్య పరికరాలను వాయించటంలో ప్రోత్సహించారు. ఇపుడు అర్నవ్ వయోలిన్, పియానో, గిటార్, తబలా సైతం వాయించగలడు. ప్రపంచ సంగీత దినోత్సవంలో పాల్గొనటంపై అడిగితే.. ప్రాక్టీస్‌కు తగినంత సమయం ఇవ్వలేదని, ఇచ్చివుంటే మరింతగా రాణించేవాడినని చెబుతాడు. ఆ వీవెంట్‌లో పాల్గొనటం ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది. ఎంతోమంది వచ్చి అభినందిస్తుంటే సంతోషమే కాదు ఏదో ఏదోఒకరోజు మంచి సంగీత వాయిద్యకారుడిగా ఘనత సాధిస్తాననే నమ్మకాన్ని కలిగించిందని చెబుతాడు. కుటుంబంలో ఎవ్వరూ కూడా సంగీతకారులు కారు. కాని సహజసిద్ధంగా అతనిలో కనబడిన ఆ కళను గుర్తించిన తల్లిదండ్రులు శిక్షణ ఇప్పించి అతన్ని ఓ చిన్న వయసులోనే ఓ సంగీత వాయిద్యకారుడిగా మలిచారు. ఓ ఏడాది నుంచి పూర్తిగా ఈ సంగీతంపైనే దృష్టిపెట్టి ప్రాక్టీసు చేస్తున్నాడు. అర్నవ్‌కు అన్నింటికంటే డ్రమ్స్ వాయించటం అంటే ఎంతో ఇష్టం. ఇప్పటికే నగరంలో ఎన్నో సంగీత కార్యక్రమాల్లో ఆయన తన సంగీతాన్ని అందించాడు. తబలా కూడా నేర్చుకుంటున్నాడు. ఎప్పటికైనా ఈ రెండు వాయిద్య పరికరాలతో సంచలనాన్ని సృష్టించేందుకు సన్నద్ధమవుతున్నాడు.