Others

నమ్మలేని నిజాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశం నుంచి విదేశాలకు అక్రమ రవాణా అవుతున్న మహిళలు, ఆడపిల్లల వివరాలు తెలుసుకుంటే మనసు ఒకింత బాధకు లోనవుతుంది.
జార్ఖండ్ రాష్ట్రం నుంచి ఏటా 8000 మంది మహిళలు, 5000 మంది ఆడపిల్లలు దుబాయ్‌కి అక్రమ రవాణాకు గురవుతున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో తెలియజేస్తోంది.
ఆడవాళ్ల అక్రమ రవాణా ఐదేళ్లలో 38.3 శాతం నుంచి 45శాతానికి పెరిగినట్లు అంచనావేశారు.
అక్రమ రవాణాకు గురవుతున్న మహిళల కేసుల్లో కేవలం 65.5శాతం మాత్రమే నమోదవుతున్నాయి.
వ్యభిచార రొంపిలోకి మహిళలను దింపి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న ముఠాలు విచ్చలవిడిగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇలా వ్యభిచార రొంపిలోకి దిగుతున్న మహిళలు అధికంగా ఉన్న రాష్ట్రాలలో పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర ముందు వరుసలో ఉన్నాయి.
దేశంలోని పశ్చిమబెంగాల్‌లో 23శాతం, బీహార్‌లో 17శాతం, అస్సాంలో 13శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 11శాతం, ఒరిస్సా, కేరళ రాష్ట్రాలలో 8శాతం మంది మహిళలు అక్రమ రవాణాకుగురవుతున్నారు.
మనదేశంలో ప్రతి పదిమంది ఆడవాళ్లల్లో నలుగురు (41శాతం) 19 ఏళ్లకే ముందే హింస, వేధింపులకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న పదేళ్లలోపు ఆడపిల్లలు బ్రెజిల్‌లో 16శాతం, బ్రిటన్‌లో 12శాతం, థాయ్‌లాండ్‌లో 8శాతం మంది ఉన్నారు.