Others

పేదల కంటి వెలుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’- ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో గోడలమీదో, పుస్తకాల్లోనో చదువుకున్నమాట ఆ అమ్మాయిని కదిలించింది. దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఆరుషి గుప్తా కళ్లుండి చూడలేని పేదలకు ఊతమైంది. చిన్న వయసులో మొగ్గతొడిగిన ఈ సేవా కుసుమం పేదలకు కళ్లజోళ్లు సరఫరా చేస్తోంది. ఓసారి తను ఉపయోగిస్తున్న కళ్లజోడు స్థానంలో కొత్తది కనుక్కొంది. మరి పాతది ఏం చేయాలి? మనం కొత్త కళ్లద్దాలు కొనుక్కుంటే పాతవి ఏం చేస్తాం? సాధారణంగా చాలామంది ఇంట్లో ఏదో ఓ మూల పడేస్తారు. కొన్ని రోజుల తర్వాత అవి చెత్తబుట్టలోకి చేరతాయి. మరికొంతమంది షాపులోనే వదిలేసి వస్తారు. అంటే వాటితో మనకు ఎలాంటి ఉపయోగంలేదు.
ఆరుషి కూడా అలానే చేస్తే ఇక్కడ ఆమెను ప్రస్తావించాల్సిన అవసరం ఉండేది కాదు. ఎలాంటి ఉపయోగమూ లేకుండా ఇంట్లో పడి ఉన్న పాత కళ్లద్దాలను చూస్తున్నపుడు ఆమెకు ఓ ఆలోచన కలిగింది. వాటిని చూపులేని, కళ్లద్దాలు కొనుక్కోలేని పేదలకెవరికైనా ఇస్తే ఉపయోగించుకుంటారు కదా అని, వెంటనే తనకు తెలిసిన ఓ స్వచ్ఛంద సంస్థకు వాటిని అందజేసింది. అక్కడితో ఆగలేదు ఆరుషి. తనతోపాటు అందరితో ఇలా చేయించాలని నిర్ణయించుకుంది. అలా మొదలైందే స్పెక్టాక్యులర్ డ్రైవ్. పాత కళ్లద్దాలను సేకరించి కళ్లజోడు కొనుక్కోలేని దుస్థితిలోవున్న పేదవారికి, అవసరమైనవారికి అందజేయడమే ఈ డ్రైవ్ లక్ష్యం.
ప్రమేరికా స్పిరిట్ ఆఫ్ కమ్యూనిటీ అవార్డు
‘స్పెక్టాక్యులర్ డ్రైవర్’ చర్యల్లో భాగంగా ఇరుగుపొరుగు వారు, ఆప్టికల్స్ (కళ్లద్దాల) షాపులు, వివిధ సంస్థలు, తెలిసినవాళ్లందరి నుంచి ఆరుషి పాత కళ్లద్దాలను, ఫ్రేములను సేకరించేది. అలా సేకరించినవాటిని హెల్ప్ ఏజ్ ఇండియా, జన్ సేవా ఫౌండేషన్, గూంజ్ వంటి ఎన్జీవోలకు, స్వచ్ఛంద సంస్థలకు అందజేసింది. వారి ద్వారా అవి పేదలకు చేరేవి. ఆరుషి 2009 నుంచి డ్రైవ్ కార్యకలాపాలను పెంచడంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. వివిధ ఎన్జీఓల సాయంతో పేదలకు ఉచిత కంటి వైద్య శిబిరాలు (ఫ్రీ ఐ క్యాంప్స్, కళ్ళ పరీక్షలు, అతి తక్కువ ఖర్చుతో కాటరాక్ట్ చికిత్సలు, కళ్లద్దాలు అందచేయడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. అసలు ఎంతమంది ఇలాంటి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు? అనే ప్రశ్న ఆరుషి మదిలో నిరంరం మెదులుతూ ఉండేది. దాంతో, ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి పరిశోధన మొదలుపెట్టింది. ఆ పరిశోధనలో ఆమెకు ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి. భారతదేశంలో సుమారుగా 15 కోట్లకుపైగా పేదలు దృష్టిలోపంతో బాధపడుతున్నారు. వారు వైద్య పరీక్షలు చేయించుకోలేక, కళ్లద్దాలు కొనుక్కోలేక అలాగే జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఇదంతా తెలుసుకున్న ఆరుషి.. ‘స్పెక్టాక్యులర్ డ్రైవ్’ చర్యలను మరింత పెంచాలని నిర్ణయించింది.
సేకరించిన కళ్లద్దాలతో ఆరుషి
ఎంతోమందిని కలిసింది, తన ఉద్దేశాలను వివరించింది. పోస్టర్లను ముద్రించి పంచింది. పాత కళ్ళజోళ్ల సేకరణకు డ్రాప్ బాక్స్‌లను ఏర్పాటుచేసింది. ఎంత చేసినా ప్రజల్లో చైతన్యం రాకపోతే ఉపయోగం ఏముంటుంది? ఆరుషికి అదే పెద్ద సవాల్. స్కూల్ ముగిసిన తరువాత ఉన్న కొద్దిపాటి సమయాన్ని దీనికోసం ఉపయోగించేది. ఆరుషి శ్రమ, పట్టుదల ఫలితంగా ఇప్పటివరకూ సుమరు 1500మంది బాధితులు లబ్ధిపొందగలిగారు. ఇది నిజంగా ఓ స్పెక్టాక్యులర్ ఎఫెక్ట్. కేవలం ఒక పాఠశాల స్థాయి విద్యార్థిని తన కృషితో 1500మందికి సాయం చేస్తే, మరి మనందరం కలిస్తే ఇంకెంత మార్పు జరుగుతుంది? అది ఊహకు అందదు. పాత, పాడైపోయిన ఫ్రేములను రీసైకిల్ చేయడంవల్ల తక్కువ ధరకే వాటిని మళ్లీ తయారుచేయవచ్చు. విక్రయించవచ్చు. పాత ఫ్రేములు చెత్త ద్వారా భూమిలో కలుస్తాయి కానీ కరగవు. ఆ ప్లాస్టిక్ ద్వారా కార్బన్ ఎమిషన్స్ పెరుగుతాయి. అందువల్ల పాతవాటిని రీసైకిల్ చేస్తే గ్లోబల్ వార్మింగ్ నుంచి ఈ భూమిని కొంతమేరకైనా కాపాడవచ్చు అంటుంది ఆరుషి. చిన్నవయసులోనే మొగ్గ తొడిగిన ఈ సేవా కుసుమం.. 4వ ప్రమెరికా స్పిరిట్ ఆఫ్ కమ్యూనిటీ అవార్డుల జాబితాలో చోటు దక్కించుకుంది.