Others

ఆకలేసే కాలానికి నడిచొచ్చే డైనింగ్ టేబులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకనేది సామెత. ఈ సామెతని బాగా అర్థం చేసుకున్న ఫొటోగ్రాఫర్ ‘జూలీ వింటర్ హాల్టర్’. అదెలా అంటే ఆకలేసి హోటల్‌కి వెళ్లి వాళ్ళకి నడిచొచ్చే టేబుల్స్ ఫలహారాలు తెస్తే ఎలా ఉంటుందా అని. అలా ఆలోచన వచ్చిందో లేదో చేస్తున్న
ఉద్యోగాన్ని వదిలేసి పార్టీలకు డిన్నర్‌లకూ ఆహారాన్ని అందించే టేబుల్స్ సరఫరా చేస్తానని ప్రకటన ఇచ్చేసింది. ఇందులో ఓ ఆసక్తికరమైన సంగతి ఉంది. ఆ టేబుళ్ళు పిలిస్తే పలుకుతారుూ, ఆర్డర్ తీసుకుంటాయి. వడ్డిస్తాయి.. తిన్నాక బిల్లూ అందిస్తాయి. అందమైన 20 మంది మోడల్స్‌తో చేయి కలిపి ‘లివింగ్ టేబుల్’ పథకాన్ని ప్రవేశపెట్టింది జూలీ. రకరకాల వేషధారణలతో అమ్మాయిలూ అబ్బాయిలూ నడుముకి చెక్క, లేదా గ్లాసు ప్లేటుని బిగించి, అందమైన దుస్తులు తొడిగి లివింగ్ టేబుల్ అనే సరికొత్త సృష్టికి నాంది పలికింది. ఇక అంతే. ప్రతీ మోడల్ నడిచొచ్చే టేబుల్లా ఆహారాన్నీ, పానీయాల్నీ అందిస్తూ అతిథుల మనసు చూరగొంటున్నారు. నవ్వుతూ పలకరించి పులకరింపజేస్తారు. దాంతో ఇప్పుడు చాలామంది దృష్టి వారివైపే వెళ్తోంది. కార్పొరేట్ పార్టీలు, వెడ్డింగ్ ఫంక్షన్స్, పుట్టినరోజు వేడుకలు ఇలా వేదిక ఏదైనా ఈ లివింగ్ టేబుల్స్‌కి ఇపుడు మంచి ఆదరణ. కాళ్ళకి బలపం కట్టుకోవడం అనేది మనం వినేమాట. ఇపుడు నడుంకి బల్ల కట్టుకోవడమన్నది సరికొత్త కళన్నమాట.

-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి