క్రేజీ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమ్మరిల్లు తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన చిత్రం. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు భాస్కర్. ఈ సినిమా తరువాత ‘బొమ్మరిల్లు భాస్కర్’గా పేరు తెచ్చుకున్న ఆయన, ఆ తరువాత చేసిన సినిమాలతో వరుస పరాజయాలు అందుకున్నాడు. చరణ్‌తో ఆరెంజ్, రామ్‌తో ఒంగోలు గిత్త సినిమాలు భారీ పరాజయం పాలవ్వడంతో ఆ తరువాత భాస్కర్ ఎక్కడా కనిపించలేదు. తాజాగా ఆయనకు మళ్లీ చరణ్ అవకాశమిచ్చినట్టు వార్తలొస్తున్నాయి. ఓ మంచి కమర్షియల్ స్టోరీని సిద్ధం చేయమని చరణ్ భాస్కర్‌కు ఫోన్ చేశాడని మెగా వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తాడట. గతంలో భాస్కర్ తెరకెక్కించిన బొమ్మరిల్లు, పరుగు చిత్రాలు దిల్‌రాజు నిర్మించాడు. ప్రస్తుతం భాస్కర్‌తో మరో సినిమా చేయడానికి చరణ్ ఆసక్తి చూపిస్తుండడం సంచలనం రేపుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.