వాసుకి పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నయనతార ప్రధాన పాత్రలో ఎ.కె.సజన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రాన్ని తెలుగులో ‘వాసుకి’ పేరుతో విడుదల చేస్తున్నారు. శ్రీరామ్ సినిమాస్ పతాకంపై ఎస్.ఆర్.మోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 14న విడుదలవుతున్న సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో రాజ్ కందుకూరి మాట్లాడుతూ- ‘సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార, ఇలాంటి ఇష్యూపై రూపొందిన సినిమాలో నటించడం మంచి విషయం. దిల్లీలో ‘నిర్భయ ఘటన’ తరువాత దేశంలో చాలామార్పులు వచ్చాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే వున్నాయి. ఇలాంటి సంఘటనలపై ఓ యువతి చేసిన పోరాటమే ఈ సినిమా. తప్పకుండా తెలుగులో మంచి విజయం సాధిస్తుంది అన్నారు. మరో నిర్మాత శివకుమార్ మాట్లాడుతూ- వాసుకి సినిమాతో నిర్మాతగా వస్తున్న మోహన్ తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటాడు. తెలుగులో నాయనతారకున్న ఫాలోయింగ్ మామూలుగా లేదు అన్నారు. నిర్మాత మాట్లాడుతూ- అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. దాన్ని తెలుగులో వాసుకి పేరుతో విడుదల చేస్తున్నాం. తప్పకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో రామసత్యనారాయణ, రాజ్ మదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.