అక్కడే సెటిలవుతా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాదీ భామ టబు తెలుగులో కంటే బాలీవుడ్‌లోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఓ సమయంలో టాప్ హీరోయిన్ రేంజ్‌లో హవా నడిపించిన ఈమె, హీరోయిన్‌గా క్రేజ్ తగ్గడంతో ప్రస్తుతం సినిమాలకు దూరంగా వుంది. ఇప్పటికే పెళ్లి వయసు దాటిపోయి చాలాకాలం అవుతున్నా కూడా ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో నిరాశకు గురైన ఈమె- సినిమాలకు రిటైర్‌మెంట్ ప్రకటించాలనే నిర్ణయంలో ఉందట! సినిమా రంగానికి దూరంగా సెటిల్ కావాలని నిర్ణయం తీసుకుందట. గ్లామర్ హీరోయిన్‌గా సంచలనం సృష్టించిన టబు రిటైర్‌మెంట్ తరువాత గోవాలో సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయిందట. అందుకోసం ఇప్పటికే ఓ అపార్ట్‌మెంట్ కూడా కొనుక్కుందని వార్తలొస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ ఈ భామకు సొంత ఇల్లు ఉంది. హైదరాబాద్, ముంబయిని వదిలేసి గోవాలో సెటిల్ అవ్వడమేమిటని అనుకుంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.