కొత్త జోనర్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారా రోహిత్, సుధీర్‌బాబు, సందీప్‌కిషన్, ఆది హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘శమంతకమణి’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం 14న విడుదలవుతున్న సందర్భంగా హీరో సుధీర్‌బాబు చెప్పిన విశేషాలు...
కథల ఎంపికలో
కథల ఎంపికలో జాగ్రత్త తీసుకోవడం ల్ల గ్యాప్ ఏర్పడుతుంది. నా మొదటి చిత్రం ఎస్‌ఎమ్‌ఎస్ తరువాత ప్రేమకథా చిత్రం చేయడానికి చాలా గ్యాప్ వచ్చింది. భలే మంచిరోజు, హిందీ భాఘి తరువాత ‘శమంతకమణి’లో చేస్తున్నాను. కథల విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటున్నా. చాలా కథలు వింటున్నా సెలెక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటున్నా. ఈ కథ శ్రీరామ్ చెప్పినపుడు చాలా కొత్తగా అన్పించింది. ఇందులో నలుగురు హీరోలు ఉన్నా కూడా ఎవరి పాత్ర వారికి ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా తెలుగు సినిమాలో మరో కొత్త జోనర్‌ని పరిచయం చేసే సినిమా ఇది.
నా పాత్ర
ఇందులో చిన్నప్పటి నుండి తల్లి ప్రేమకు దూరమైన యువకుడిగా కన్పిస్తాను. మంచి ఎమోషన్స్‌తో ఉంటుంది. నా చుట్టూ వున్న పాత్రలు కామెడీగా ఉన్నా, నాతో సెటిల్డ్‌గా నటింపజేశారు. ఓ రియల్ సంఘటన బేస్ చేసుకొని తీసిన సినిమా ఇది. ఓ కారు చుట్టూ తిరిగే కథ. దర్శకుడు శ్రీరామ్ నాతో ‘్భలే మంచిరోజు’ చేయడంతో అతని కమిట్‌మెంట్ నాకు తెలుసు. అందుకనే ఈ కథ ఒప్పుకున్నా.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతం వీరభోగ వసంతరాయ సినిమా చేస్తున్నాను. దాంతోపాటు విరించి వర్మ అసిస్టెంట్ దర్శకత్వంలో ఓ సినిమా, పుల్లెల గోపీచంద్ బయోపిక్, దాంతోపాటు మరో ప్రేమకథలో చేస్తున్నా.

- యు