సవాళ్లంటే ఇష్టం: ఎన్టీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ తెలుగు సినిమా రంగంలో స్టార్ హీరోగా తనదైన ఇమేజ్‌ని స్వంతం చేసుకున్న హీరో. ఎన్టీఆర్ సినిమా అంటే బాక్సాఫీస్ లెక్కలు, అభిమానుల అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. ప్రస్తుతం జై లవకుశ సినిమాలో మూడు పాత్రల్లో నటిస్తున్న ఎన్టీఆర్ మరోవైపు ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు టీవీ షోకు హోస్ట్‌గా మారాడు. బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన 3బిగ్‌బాస్2 షోను ఇప్పుడు తెలుగులో రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఈనెల 16 నుండి మొదలుకానుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో ఇంటర్వ్యూ..
* ఈ షోకు హోస్ట్‌గా ఎందుకు అంగీకరించారు?
- జనరల్‌గా నాకు ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం. నిజానికి టీవీలో హోస్ట్‌గా చేయాలని, దానికెలా మాట్లాడాలి? ఎలా వుండాలి? అనేదానిపై అవగాహన లేదు. కానీ మా టీవీ చానల్ వాళ్లు ఎప్పుడైతే ఈ షోకు హోస్ట్‌గా చేయమని అడిగారో అప్పుడే అనుకున్నాను చేయాలని. ఎందుకంటే ఇది కూడా నాకు ఛాలెంజింగ్ లాంటిదే. ఇలాంటి ఆసక్తికరమైన విషయం కోసం ఎదురుచూస్తున్నాను.
* వ్యాఖ్యాతగా షో నిర్వహించడం భారం కాదా?
- చెప్పానుగా. ఛాలెంజింగ్ అంటే ఇష్టమని. ఇండియాలో అతి పెద్దదైన రియాలిటీ షోను తెలుగులో నేను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తానని నాపై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చిన వారికి థాంక్స్. కచ్చితంగా వారి నమ్మకాన్ని నిలబెడతాననే నమ్మకంతోనే షో చేశా.
* ఇప్పటికే హిందీలో వస్తున్న ఈ షోపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి, దీని గురించి?
- ఏదైనా మనం ఫీలయ్యేదాన్నిబట్టే ఉంటుంది. హిందీ షోను నేను ఇప్పటివరకూ చూడలేదు. పైగా ఈ కంటెంట్‌కు సంబంధించిన వ్యవహారాలన్నీ తెలుగు ప్రేక్షకులు నచ్చేలా వారికెలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ముఖ్యంగా ప్రేక్షకుల సెన్సిబిలిటీకి దగ్గరగా వుంటుంది. ఒకప్పుడు ఒక వ్యక్తి గురించి తెలియాలంటే చాలా కాలం పట్టేది. కానీ సోషల్ మీడియా వచ్చిన తరువాత అందరం పబ్లిక్ లేయర్‌లోకి వచ్చేశాం. ప్రతి మనిషి తన గురించి తెలుసుకోవాలని ఆరాటపడడం సహజమే. ఈ షో కూడా అలాంటిదే.
* ఇప్పటివరకూ వేరే షోలు చేయమని ఆఫర్లు వచ్చుంటాయి, కానీ బిగ్‌బాస్‌నే చేయడానికి కారణం?
- గతంలో అవకాశాలు వచ్చాయి కానీ ఎందుకో ఈ షో నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా ప్రపంచానికి దూరంగా కొందరు వ్యక్తుల్ని ఓ ఇంట్లో వుంచి వారి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగే ఐడియా బాగుంది. ఇలాంటి షోలో పాల్గొనేకంటే హోస్ట్‌గా చేయడమే ఛాలెంజింగ్ అనిపించింది. అందుకని ఒప్పుకున్నాను. ఇందులో నేను బిగ్‌బాస్‌కు, పోటీదారుల మధ్య వారధిగానే ఉంటాను.
* ఎవరి లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
- నాకు మా ఆవిడ, మా అబ్బాయిల గురించి రహస్యంగా తెలుసుకోవాలనుంది. ఎందుకంటే, ఇంతకుముందు వాడ్ని 3నీకు అమ్మంటే ఇష్టమా? నాన్నంటే ఇష్టమా2 అని అడిగితే, వాడు నానే్న ఇష్టమని చెప్పాడు. ఈమధ్య స్కూల్‌కు వెళుతున్నాడు. నేను షూటింగ్‌ల్లో వుండడంవల్ల వాడు లేచే సరికి నేను వెళ్లిపోవడం, తరువాత వాడు పడుకున్న తరువాత నేను రావడంతో మేమిద్దరం కలవడం కుదరలేదు. దాంతో వాడు వాళ్ళమ్మకు బాగా దగ్గరయ్యాడా? అని, అసలు నేనింట్లో లేనపుడు వీరిద్దరూ ఏం ప్లాన్ చేస్తారని తెలుసుకోవాలనివుంది (నవ్వుతూ..)
* 3నటరత్న2 ఎన్టీఆర్ బయోపిక్‌లో మీరు నటించే అవకాశం వుందా?
- తాతగారు తెలుగు ప్రజల ఆస్తి. ఆయనపై సినిమా తీస్తే ఆనందమే. కానీ నేను నటించే విషయం గురించి చెప్పలేను.
* మీ బాబాయి చేస్తానని వార్తలొస్తున్నాయి? దీని గురించి?
- బాబాయి చేస్తే ఇంకా ఆనందమే కదా!

- శ్రీ