నాగార్జునతో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశాబ్దానికిపైగా గ్లామర్ హీరోయిన్‌గా హవా సాగిస్తున్న కాజల్‌కు ఇంకా క్రేజ్ పెరుగుతూనే వుంది. ఇప్పటికీ స్టార్ హీరోల సరసన అవకాశాలు పట్టేస్తూ చెరగని గ్లామర్‌తో అదరగొడుతూనే వుంది. ఈమధ్యే మెగాస్టార్ సరసన ఖైదీ నెం 150లో చిందేసిన కాజల్, మరోవైపు తమిళ్‌లో కూడా బిజీగావుంది. తాజాగా నాగార్జున నటిస్తున్న రాజుగారి గది-2 చిత్రంలో గెస్ట్ పాత్రలో కనిపిస్తుందని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఆమె పది రోజులు షూటింగ్‌లో పాల్గొన్నదని, ఆమె పాత్ర ఇందు లో ఎలా ఉంటుందనే ఆసక్తిని రేపుతోంది. కాజల్ నటిస్తున్న విషయాన్ని చిత్ర యూనిట్ రహస్యంగా ఉంచింది. మరోవైపు రానా సరసన నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో నటిస్తున్న కాజల్‌కు ప్రస్తుతం మళ్లీ అవకాశాలు క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా సెలెక్టివ్‌గా పాత్రల్ని ఎంచుకుంటుందని, అందులో భాగంగానే రాజుగారి గది-2 చిత్రంలోని పాత్ర నచ్చడంతో ఒప్పుకుందట. సమంత, సీరత్‌కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా కాజల్ నాగార్జున సరసన నటించిందా? అని ఆసక్తి మొదలైంది.