డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 49

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరితో పంచుకోవాలనుకున్నా నాకు అభ్యంతరం లేదు. అది నీకు స్పష్టంగా తెలియాలి’’ అన్నాను.
‘‘నాకు తెలుసమ్మా, నిర్ణయం నాదేనని. కాని, నీ ఉద్దేశ్యం కూడా నాకు ముఖ్యమే!’’ అన్నాడు.
‘‘సరే చెప్పేశావుగా! ఇంతకీ నాకు ఒకటి చెప్పు. చిన్నప్పుడు అంటూ ఉండేవాడివి. ఎప్పుడో వెళ్లి అతన్ని అన్నీ అడిగేస్తా!’’ అని. అమెరికా వచ్చి ఇనే్నళ్ళల్లో అతన్ని కలవడం జరిగిందా లేదా! అన్నాను.
ఈ దేశంలోకి వచ్చాక, రాకముందు కూడా ఈ ప్రశ్న నా మనసులో అప్పుడప్పుడూ మెదులుతూనే ఉండేది. కాని నా అంతట నాకు ఈ విషయం మాట్లాడటానికి ఇష్టంలేదు. వాడంతట వాడు ఎప్పుడూ చెప్పలేదు.
చిన్నగా నవ్వాడు. ‘‘చిన్నప్పుడు అనుకునేవాడిని. కానీ, అమెరికా వచ్చాక అసలు అలాంటి ఆలోచనే రాలేదు. కానీ, సో ఐరనిక్. అతన్ని కలిశాను. నాకు ఎంతో ముఖ్యమైన రోజున. ఎంతో సంతోషంగా, సంతృప్తిగా ఉన్న రోజున కలిశాను. ఆ తరువాత నా సంతోషమంతా హరించుకుపోయింది. చాలా కోపం వచ్చింది.
బలవంతాన అణచుకున్నాను. మళ్లీ నీ మాటలు గుర్తుకు తెచ్చుకోవాలని ప్రయత్నం చేశాను. నీది కానిదాన్ని నీకు లభించలేదని బాధపడటం దేనికి? నీదైనది నీకు దూరమయితే బాధపడాలి కానీ అనేదానివి నువ్వు ఎప్పుడూ. అదే పదిసార్లు చెప్పుకున్నాను. తరువాత మర్చిపోయాను. మళ్లీ ఇనే్నళ్ళ తరువాత ఇవాళ వీళ్ళు గుర్తుచేశారు.
అర్థం కానట్లు చూశాను. వాడి మాటల్లో చిరాకు గమనిస్తూ!
నా గ్రాడ్యుయేషన్ డే, అమ్మా! యుఓఎఫ్‌ఎమ్‌లో చాలా గొప్పగా చేస్తారు. చాలా చాలా పెద్ద యూనివర్సిటీల నుంచి, ఇండస్ట్రీస్ నుంచి పెద్దపెద్దవాళ్ళు స్పీకర్స్‌గా ఆహ్వానిస్తారు. గౌరవనీయమైన డాక్టరేట్ ఇచ్చి సన్మానిస్తారు. నేను నా థీసిస్‌లో చాలా బిజీగా ఉన్నాను. అది అప్రూవ్ అయింది. కానీ, దాన్ని ఫైనల్ టైప్ చేయించి, బైండ్ చేయించి ఎన్నో కాపీస్ చేయించి అన్నీ ఒక పద్ధతిలో సబ్‌మిట్ చేయాలి. ఆ పనులతో నా గ్రాడ్యుయేషన్‌కి జరుగుతున్న ఏర్పాట్లు గురించి నేను పెద్దగా శ్రద్ధ పట్టలేదు.
కొద్దిమంది క్లోజ్ ఫ్రెండ్స్‌ని పిలిచాను. తేజాని కూడా పిలిచాను. అది చాలా పెద్ద ఫంక్షన్. పిహెచ్‌డి చేసిన వాళ్ళు, ఎంఎస్ చేసినవాళ్ళు, బిఎస్ చేసినవాళ్ళు అందరికీ డిగ్రీస్ చేత్తో అందిస్తారు. సామాన్యంగా పిహెచ్‌డి వాళ్ళు చాలా కొద్దిమంది.
మొత్తంమీద హాల్‌లో కూర్చుని ఆ రోజు ప్రోగ్రాం పేపర్ అంతా పైనుంచి క్రిందదాకా చూడబోయాను. చాలా ఇండియన్ పేర్లు కనిపించాయి. ఎక్కువమంది బిఎస్ తీసుకుంటున్న వాళ్ళు, పైన డీన్ పేరు పెద్ద పెద్ద ప్రొఫెసర్ పేర్లు, కీనోట్స్ స్పీకర్ పేరు చూడగానే ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. డా.రఘురామ్ కిందనే వరల్డ్ రినోన్ సైంటిస్ట్, హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్, బయోకెమిస్ట్రీ, డీన్ ఆఫ్ కొలంబియా, స్పెషల్ కన్సల్టెంట్.. ఆఫ్ ఎన్‌ఐహెచ్ ఇంకా చాలా చాలా రాసి ఉన్నాయి అతని పేరు కింద.
ఆ క్షణం ఆగిపోతే బాగుండుననిపించింది. లేచిపోతే బాగుండుననిపించింది. నేను డిగ్రీ అందుకోకుండా డిస్‌క్వాలిఫై అయితే బాగుండుననిపించింది.
కాని, ఏమీ జరగలేదు. లేచి వెళ్లాను. అందరికి షేక్ హాండ్స్ ఇచ్చాను. డా.రఘురామ్‌కి కూడా. డిగ్రీ అందుకుని క్రిందకు వచ్చి నా సీట్‌లో కూచున్నాను. అక్కడనుంచి వెళ్లిపోవాలనిపించింది. కాని, ఇంకా డిగ్రీలు అందుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన రోజే! సభ్యత అడ్డుపడి ఆపేసింది. కాని, మనసు ఎందుకో చాలా చిన్నబోయింది. ఆ రోజు ఆ ఫంక్షన్‌లో ఉండాలని నే కోరుకున్న వ్యక్తి నువ్వు. అటువంటిది అతను ఉన్నాడు. షేక్‌హాండ్ ఇచ్చి డిగ్రీ చేతికి ఇచ్చాడు.
మనసంతా కుంచించుకుపోయింది. చాలా చిన్నతనమనిపించింది. ఆ రోజు అక్కడున్న వాళ్ళంతా అతన్ని కలవడం ఎంతో గర్వకారణం అనుకుంటూంటే నాకు సిగ్గుపడేలా చేసింది.
ఆ ఫంక్షన్ తరువాత చాలా పెద్ద రిసెప్షన్ అరేంజ్ చేశారు గ్రాడ్యుయేట్స్ కోసం. నేను, మెల్లగా అక్కడనుంచే జారుకుందామనుకున్నాను. తేజా కూడా వచ్చింది.
ఇంతలోనే ఫంక్షన్ పూర్తికాగానే మా గైడ్ అండ్ ప్రొఫెసర్ డా.విల్సన్ నా పక్కనే నడుస్తూంటే తప్పించుకోవడం కుదరలేదు. దాంతో నేనూ రిసెప్షన్‌కి వెళ్లాల్సి వచ్చింది.
అన్ని వందల మంది గ్రాడ్యుయేట్స్‌లో అంత పెద్ద హాల్‌లో అతని వైపు నా మొహం కూడా కనిపించకుండానే తిరిగాను.
ఇంక మెల్లిగా వెళ్లిపోదామని బయటకు రాబోతుంటే అతను, మరో ఇద్దరు ప్రొఫెసర్స్ కలిసి నా వైపు నుండి వెళ్లబోయారు. అందులో ఒకతను నా గైడ్, రెండవ అతను డిపార్టుమెంట్ హెడ్, నన్ను ఆపి చాలా సగర్వంగా పరిచయం చేశారు. నేను ఎన్నుకున్న టాపిక్ గురించి, నా వర్క్‌ని గురించి. అతను సాదరంగా హ్యాండ్ జాపాడు షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి.
మరి కాసేపటికి వంటరిగా వచ్చి, మళ్లీ పలకరించాడు. నా సర్ నేమ్ చూసి, ఏ ఊరి నుంచి అని అడిగాడు. చెప్పాను. ఆ ఊళ్ళో తాతయ్య పేరు చెప్పి నీకు తెలుసా అని అడిగాడు. తెలియదని చెప్పాను. నా వేర్ ఎబౌట్స్ కూడా ఆయనకు చెప్పాలనిపించలేదు.
అదేం పని?
‘‘అలా ఎందుకు చెప్పావ్? తెలుసు అనే చెప్పాల్సింది’’ అన్నాను.
తల అడ్డంగా ఊగించాడు. నాకు అవసరం అయినదానికంటే మరొక్క మాట కూడా మాట్లాడాలనిపించలేదు అన్నాడు వౌళి.
ఆ రాత్రికి రూంకి వచ్చి పడుకున్నాక నా మనసు అతన్ని గురించి ఎప్పుడూ ఆలోచించినంతగా ఆలోచించింది.
సొసైటీలో ఎంతో తెలివైనవాళ్ళను, గొప్ప వ్యక్తులను కలుస్తాం కాని, వారి వెనక ఉండే చీకటి కోణాలు ఎవరికీ తెలియవు. ఒకవైపు ఎంతో ఆలోచనా శక్తి ఉన్నవాళ్ళు మరోవైపు ఇతరుల గూర్చి ఆలోచించలేనంత స్వార్థపరులు ఎలా అయిపోతారో ఏమో అని?
‘‘అది స్వార్థపరత్వం కాదు వౌళి. చేతకానితనం. లిమిటెడ్ ఎబిలిటి. ఆపర్ట్యూనిటీ కాస్ట్ అన్నమాట. ఒకటి పొందాలంటే మరొకటి కోల్పోతారు’’ అన్నాను.
అంత చిరాకులోనూ వౌళి పెదిమలమీదకు నవ్వు వచ్చింది. నీ ఎకనామిక్స్ జీవితానికి ఆపాదించకు అన్నాడు.
-ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి