బాలీవుడ్ ఛాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ కాజల్, టాప్ హీరోయిన్‌గా ఉంది. సౌత్‌లో ఎన్ని చిత్రాలు చేసినా కూడా ఈమె ఫోకస్ అంతా బాలీవుడ్‌పైనే వుందట. అప్పుడప్పుడు బాలీవుడ్‌లో కూడా ప్రయత్నాలు సాగిస్తున్న ఈమెకు తాజాగా ఓ మంచి అవకాశం దక్కింది. తాజాగా బాబీ డియోల్ సరసన హీరోయిన్‌గా నటించేందుకు ఓకె చెప్పిందట. సన్నీడియోల్ సొంత బ్యానర్‌లో తెరకెక్కే యమ్‌లా పాగల్ దివానా-3 పేరుతో తెరకెక్కే ఈ చిత్రంలో ధర్మేంద్రతోపాటు ఆయన ఇద్దరు కుమారులు సన్నీ, బాబీలు నటిస్తున్నారు. గతంలో కాజల్ నటించిన దో లఫ్జోంకి కహానీ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోకపోవడంతో ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది కాజల్. మరి ఆమె ఆశలు బాలీవుడ్‌లో నెరవేరతాయో లేదో చూడాలి!