కోటిపల్లి శివగా అలరిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచి తూచి అడుగులేస్తూ ఒక్కో విజయాన్ని అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు సందీప్ కిషన్. భిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ కమర్షియల్‌గా విజయాల్ని అందుకుంటున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘శమంతకమణి’. నారా రోహిత్, సుధీర్‌బాబు, ఆదిలతో కలిసి సందీప్ నటిస్తున్న ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలకానున్న సందర్భంగా సందీప్ చెప్పిన విశేషాలు..
కోటిపల్లి శివగా
ఈ చిత్రంలో నాది థియేటర్‌లో ప్రొజెక్షన్ రూమ్‌లో ఆపరేటర్‌గా కనిపిస్తాను. పేరు కోటిపల్లి శివ. నాకో ఫెయిల్యూర్ ప్రేమకథ ఉంటుంది. నా పాత్ర అంతా చాలా సందడిగా సాగుతుంది. ఈ చిత్రంలో నా పాత్రకు, కారుకు ఏం సంబంధం అనేది ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే, అది చెబితే మా దర్శకుడు ఏడుస్తాడు.
కారణమదే
ఈ సినిమాలో నటించడానికి ముఖ్య కారణం-శ్రీరామ్ చెప్పిన కథ. అతను అంతకుముందు తీసిన సినిమా కూడా నాకు బాగా నచ్చింది. కథపై మంచి పట్టు వున్న దర్శకుడు. ఇందులో మరో ముగ్గురు హీరోలున్నా కూడా నటించడానికి కారణం ఇక్కడ హీరోలుగా కాకుండా పాత్రలే కనిపిస్తాయి. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. నలుగురం హీరోలు కలిసి చిన్నపాటి మల్టీస్టారర్ చేశాము. వాళ్లతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.
వరుస సినిమాలతో
ప్రస్తుతం సినిమా తరువాత సినిమా ప్లాన్ చేస్తున్నాను. కృష్ణవంశితో చేసిన నక్షత్రం త్వరలో విడుదల కానుంది. తమిళంలో మరో సినిమా కూడా చేస్తున్నాను. ఇప్పటికే నగరం చిత్రం మంచి విజయాన్ని అందించింది.

-శ్రీ