16న గౌతమ్‌నంద పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్, హన్సిక, కేథరిన్ హీరో హీరోయిన్లుగా సంపత్‌నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.్భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న చిత్రం ‘గౌతమ్‌నంద’. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలు ఈనెల 16న విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ- అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని ఈనెల 28న విడుదల చేస్తున్నాం. ఇప్పటికే టీజర్, సాంగ్ ప్రోమోస్‌తో విశేషమైన స్పందన లభించింది. తమన్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. గోపీచంద్ స్టైలిష్ లుక్, సంపత్‌నంది మేకింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. మాస్‌లో గోపీచంద్‌కున్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని స్టైలిష్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాం. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:తమన్, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, కెమెరా:ఎస్.సౌందర్‌రాజన్, నిర్మాతలు: జె.్భగవాన్, జె.పుల్లారావు, దర్శకత్వం:సంపత్‌నంది.