స్ఫూర్తినిచ్చే కథతో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందమా కథ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రవీణ్ సత్తారు. ఎల్‌బిడబ్ల్యూ సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టిన ఆయన ఆ తరువాత గుంటూరు టాకీస్ సినిమాను తెరకెక్కించారు. తాజాగా రాజశేఖర్ హీరోగా పి.ఎస్.వి గరుడవేగ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో త్వరలో విడుదల కానుంది. శుక్రవారం ప్రవీణ్ సత్తారు పుట్టినరోజు సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ...
* కెరీర్ ఎలా వుంది?
- కెరీర్ పరంగా చాలా ఆనందంగా ఉన్నాను. ప్రస్తుతం గరుడవేగ సినిమా విషయంలో బిజిగా ఉన్నాను. ఇక ఈ పుట్టినరోజు ప్రత్యేకత అంటారా? ఏమీ లేదు. ఎప్పటిలాగే ఫ్యామిలీతో కలిసి జరుపుకుంటాను.
* గరుడవేగ గురించి?
- గుంటూరు టాకీస్ సినిమా తరువాత ఏ సినిమా చేయాలి అనుకుంటున్న టైములో రాజశేఖర్ నన్ను కలిశాడు. అప్పటికే నా దగ్గర చాలా కథలు ఉన్నాయి. ఆయన నటించిన మగాడు సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ తరహాలోనే పోలీసు కథతో సినిమా తీస్తే బాగుంటుందని అనిపించి ఈ కథ చెప్పా. ఆయనకు నచ్చడంతో సినిమా మొదలుపెట్టాం. ఎన్.ఐ.ఏ అనే సంస్థ నేపథ్యంలో సాగుతుంది. పూర్తిగా ఫిక్షన్ కథ. ఉగ్రవాదులకు సంబంధించిన అంశాలతో ఈ సినిమా ఉంటుంది.
* సినిమా ప్రోగ్రెస్?
- పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే సినిమా ఇది. జార్జియా, సింగపూర్, థాయిలాండ్ వంటి దేశాల్లో చిత్రీకరించాం. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం సి.జి వర్క్ జరుగుతోంది. అన్ని అనుకున్న టైమ్‌లో అయితే ఆగస్టు చివరలో విడుదల చేస్తాం.
* రాజశేఖర్ పాత్ర?
- ఇందులో ఆయన ఎన్‌ఐఎకు చెందిన ఇంటిలిజెన్స్ అధికారిగా కనిపిస్తారు. వృత్తిరీత్యా సీక్రెట్‌గా చేయాల్సిన ఆపరేషన్‌లు చాలా ఉంటాయి. అవి వాళ్ల ఫ్యామిలీస్‌తో కూడా పంచుకోరు. అలా ప్రొఫెషనల్ లైఫ్‌ని, పర్సనల్ లైఫ్‌ని ఎలా బాలెన్స్ చేశాడు అనే పాత్రలో అద్భుతంగా నటించాడు. పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా వుంటుంది.
* బడ్జెట్ పెరిగిందట?
- కథ ప్రకారంగా బడ్జెట్ పెరిగిన విషయం నిజమే. కానీ సినిమాను క్వాలిటీతో తీయాలంటే బడ్జెట్ అవసరం. ఈ చిత్రానికి 25 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాను. తప్పకుండా సినిమాపై నమ్మకం వుంది.
* తదుపరి చిత్రాలు?
- పుల్లెల గోపీచంద్ జీవిత కథతో సుధీర్‌బాబుతో ఓ సినిమా చేస్తున్నా.

-యు