ఇక మలయాళంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగాల్ టైగర్, అధినేత, ఏమైందీ ఈవేళ.. లాంటి చిత్రాలను రూపొందించిన కె.కె.రాధామోహన్ మలయాళ నిర్మాతగా మారుతున్నారు. మిత్రులతో కలిసి మలయాళంలో కల్యాణం పేరుతో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ప్రారంభించనున్నారు. మలయాళ హీరో ముఖేష్ తనయుడు శ్రావణ్ ముఖేష్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ రాజీవ్ నాయర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిస్తారు. ఈనెల 16న త్రివేండ్రంలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ- ‘దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చడంతో అందరికీ ఈ సినిమా నచ్చుతుందన్న నమ్మకంతో మలయాళ రంగంలో నిర్మాతగా అడుగులు వేస్తున్నానని, వర్ష హీరోయిన్‌గా నటిస్తోందని తెలిపారు. నితిన్ కథానాయకుడిగా తమ సంస్థలో ఓ భారీ చిత్రాన్ని రూపొందించనున్నామని, ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమా వివరాలు తెలియజేస్తామన్నారు.