21న మాయామాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిలీప్, ఈష, దీక్షాపంత్ ప్రధాన తారాగణంగా గోవింద్ లాలమ్ దర్శకత్వంలో కె.వి.హరికృష్ణ, చందూ ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘మాయామాల్’కు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈనెల 14న విడుదల కావలసిన ఈ చిత్రాన్ని 21న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- ‘హారర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని 14న విడుదల చేయడానికి అన్నీ సిద్ధమైనా, ఎక్కువ సినిమాలు అదే రోజున విడులవుతుండడంవల్ల ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని డిస్ట్రిబ్యూటర్లు సూచించడంతో ఇదే నెల 21కి వాయిదా వేశామ’ని తెలిపారు. అనుకున్నదానికన్నా సినిమా ఔట్‌పుట్ బాగా వచ్చిందని, చిత్రంలో విలన్ ఎవరనదే ఆసక్తికరమైన అంశమని వారు తెలిపారు.