ఉయ్యాలవాడ.. మొదలవుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు చిరంజీవి హీరోగా నటించే 151వ చిత్రానికి సంబంధించిన సన్నాహాలు జోరందుకున్నాయి. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌తోపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావచ్చాయి. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 22న ప్రారంభిస్తారని తెలిసింది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మించనున్న ఈ చిత్రం ఏకంగా 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, అందులో ఐశ్వర్యారాయ్, నయనతార నటిస్తున్నట్లు తెలిసింది. బాహుబలి తరువాత తెలుగు సినిమా మార్కెట్ పరిధి పెరిగింది కాబట్టి ఆ దిశలోనే ఈ చిత్రాన్ని భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినిమాని ప్రారంభించడంతోపాటు టీజర్‌ను, ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేస్తారట. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది.