డ్రగ్స్‌తో టాలీవుడ్‌కు చెడ్డపేరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా డ్రగ్స్ మాఫియా కనిపిస్తోంది. ముఖ్యంగా పలు స్కూల్స్, కాలేజీలలో పిల్లలు డ్రగ్స్‌కు బానిసలయ్యారనే వార్తలు తల్లిదండ్రుల్లో దడపుట్టిస్తోంది. ఈ విషయంపై పోలీసులు సీరియస్‌గానే అనే్వషిస్తున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ వ్యవహారంలో సినీ పరిశ్రమలో కొందరు ఉన్నారన్న విషయం తీగలాగితే డొంకంతా కదిలినట్లుగా ఒక్కొక్క వార్త బయటికి వస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లోని ముగ్గురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్లు, ఇద్దరు దర్శకులు ఈ వ్యవహారంలో ఉన్నారని, వారికి పోలీసులు నోటీసులు కూడా పంపించడం సంచలనం రేపుతోంది. ఇటీవలే 50 స్కూళ్లు, కాలేజీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న గ్యాంగ్‌ను పట్టుకున్నారు. ఈ గ్యాంగ్‌పై చేసిన దర్యాప్తులో నమ్మలేని నిజాలు ఎన్నో బయటికొచ్చాయి. సినీ పరిశ్రమతో వీళ్లకు సత్సంబంధాలున్నాయని, అత్యంత ప్రమాదకరమైన మత్తు పదార్థాలను కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలకు అమ్మినట్టు చెప్పారు. దాంతో వీళ్లెవరు అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేయడంతో అవాక్కైయ్యే నిజాలు తెలిశాయట. వీళ్లకు నోటీసులు పంపించిన పోలీసు శాఖ ఆరు రోజుల్లోగా విచారణకు హాజరై నిజానిజాలు బయటపెట్టాల్సిందిగా పేర్కొంది. ఈ విషయం సినీ వర్గాల్లో సంచలనం రేపడంతో అసలు ఎవరా ముగ్గురు హీరోలు, నలుగురు నిర్మాతలు, ఇద్దరు దర్శకులు? అనే దిశగా ఆరాలు మొదలయ్యాయి. అయితే వాళ్ల కెరీయర్ నాశనం చేయడం ఇష్టంలేకనే పోలీసులు వారి పేర్లను గోప్యంగా ఉంచారట. ఈ విషయంపై బుధవారం హైదరాబాద్‌లోని చాంబర్‌లో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటుచేశారు.
నిఘా ఉంది జాగ్రత్త..
ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ- ‘తెలుగు పరిశ్రమలో కొంతమంది యంగ్ స్టార్స్ డ్రగ్స్ మత్తులో తేలుతున్నట్లు తెలిసింది. అలాంటివాళ్లవల్ల పరిశ్రమకే చెడ్డ పేరు వస్తోంది. మత్తులో తేలింది పదిమందే కావచ్చు కానీ, ఆ ప్రభావం మిగతావారిపై పడుతోంది. వాళ్లంతా తక్షణం మత్తునుంచి బయటకు రావాలి’ అన్నారు. ఈ విషయాలేవీ బయటకు తెలియవని వాళ్లు అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వం, సినిమా పరిశ్రమ వీరిని ఒక కంట కనిపెడుతూనే వుంది. ముంబయి నుంచి ఈ కల్చర్ మన పరిశ్రమకు పాకింది. రేవ్ పార్టీల్లో ఒకరిద్దరు సపరేట్‌గా మారి మిగతావారిని వారిపట్ల ఆకర్షితులను చేయడం జరుగుతోంది. టెస్ట్‌కోసం తీసుకున్నవాళ్లు తరువాత బానిసలుగా మారుతున్నారు. కళ్లు మూసుకుని పాలు తాగుతున్నామని అనే భ్రమలో వుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. దీనివల్ల ఆరోగ్యం, కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతాయి. డ్రగ్స్ సరఫరా చేసేవారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇలాంటి అలవాట్లు వున్నవారు తక్షణం మానుకొని మంచి మార్గంలోకి రావాలి’ అన్నారు. నిర్మాత సురేష్‌బాబు మాట్లాడుతూ- ‘డ్రగ్స్ సొసైటీకి హానికరం. ఇలాంటి మార్గంలోకి వెళ్ళేవారికి అవేర్‌నెస్ కల్పించాలి. తెలుగు సినిమా ఆరోగ్యకరమైన వాతావరణంలో వుంది. దాన్ని చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిదీ అన్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ- ఎవరికైనా కష్టం వస్తే వాళ్ల బాధను పంచుకోవడం అనేది సినిమా పరిశ్రమ ఎప్పటినుంచో చేస్తున్నదే. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన డ్రగ్స్ మహమ్మారిని కూడా మనం తరిమేయాలి. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్, పరుచూరి వెంకటేశ్వరరావు, ఏడిద శ్రీరాం పాల్గొన్నారు.