క్రేజీ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం టాలీవుడ్‌లో దూసుకుపోతోంది రకుల్‌ప్రీత్ సింగ్. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ టాప్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం మహేష్ సరసన స్పైడర్‌లో నటిస్తున్న రకుల్, మరో క్రేజీ అవకాశాన్ని అందుకుంది. పవన్‌కళ్యాణ్ సరసన రకుల్ హీరోయిన్‌గా అవకాశం కొట్టేసింది. ఆ వివరాల్లోకి వెళితే, త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమా పూర్తికావచ్చింది. ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ నటించే చిత్రంలో రకుల్‌ని హీరోయిన్‌గా తీసుకుంటున్నారట. కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. మరోవైపు యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన జయ జానకి నాయక చిత్రంలో కూడా రకుల్ నటిస్తోంది. మొత్తానికి అటు పవర్‌స్టార్‌తో ఇటు సూపర్‌స్టార్‌తో అవకాశాల్ని అందుకున్న ఈ భామ నిజంగా లక్కీగరల్ అని చెప్పాలి.