డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 55

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవునన్నట్లు తల ఊగించాను.
‘‘మీరు వస్తున్నారు కదా’’ అన్నాడు. పెళ్లికి అటెండ్ అవుతున్నవారి ఆర్‌ఎస్‌విపి లిస్టులో వాళ్ళ పేర్లు కూడా చదివినట్లు అనిపించింది.
‘‘తప్పకుండా’’ అంది.
‘‘మీకు తెలుసా ఆంటీ- వాళ్ళు మా హోటల్‌లో ఆగినపుడు వీరిద్దరూ హస్పెండ్ అండ్ వైఫ్ అనుకున్నాను. అందుకే లోపలకు రమ్మన్నాను.’’
‘‘సింగిల్స్ అంటే అసలు పిలిచేదాన్ని కాదు అంది జయంత్ భార్య. తరువాత తేజ చెప్పింది ఇద్దరూ స్టూడెంట్స్ అని, అతనెవరో తనకూ తెలియదని’’.
‘‘ఇది చాలా డామాజింగ్ అభియోగం’’ అన్నాడు వౌళి నవ్వుతూ!
‘‘పెళ్లి కలిగించే గౌరవాలలో నమ్మకం ఒకటి’’ అన్నాడు జయంత్.
వెనక్కి బయలుదేరాం. మళ్లీ వౌళి అన్నాడు. స్నో స్టార్ట్ అయిన రెండు వారాల తరువాత మళ్లీ ఇటువైపు వచ్చాను. వస్తూ దారిలో ఈ ఎగ్జిట్ చూడగానే హోటల్ గుర్తుకువచ్చింది. మరోసారి హలో చెబ్దామనిపించింది.
నన్ను చూడగానే జయంత్‌కి చాలా సంతోషం కలిగింది. చాలామంది వస్తారు. రూంలో ఉంటారు, వెడతారు. కానీ మళ్లీ ప్రత్యేకంగా కలవాలని ఆగింది నువ్వు ఒక్కడివే అన్నాడు.
వెంటనే ఆ రోజు మీకు రూం ఇవ్వలేకపోయానని చాలా అనుకున్నాను. ‘‘ఇంతకీ బాబీజీ ఏది?’’
‘‘ఎవరు తేజస్వినా?’’ అన్నాను.
తల ఊగించాడు.
‘‘నోనో! ఆ అమ్మాయి లాన్సింగ్‌లో చదువుకుంటోంది. ఆ రోజు స్నోలో కారు ఆగిపోతే రైడ్ ఇచ్చాను అంతే!’’ అన్నాను.
మనసులో అనుకున్నాను, థాంక్ గాడ్! రూం ఖాళీగా ఉంది అంటే ఇంకాస్త ఇరకాటంలో పడేవాడిని, కారులో రావడానికే సందేహించిన అమ్మాయితో.
‘‘ఆ రోజు శాంతి మీ ఇద్దరినీ చూసి క్యూట్ కపుల్ అంది కాబోలు అనుకున్నాను’’ అన్నాడు.
‘‘అలా వచ్చింది మనసులోకి, జీవితంలోకి తేజ’’ అని నవ్వాడు వౌళి. అబ్బా! ఆ నవ్వు చూస్తే మాత్రం..’’ అనుకున్నాను.
‘‘అదన్నమాట కారణం’’ అన్నాను.
అర్థంకానట్లు చూచాడు వౌళి.
‘‘ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగం కోసం చూసుకోవాలనేవాడివి. పిహెచ్‌డిలో ఎందుకు చేరావా అని చాలాసార్లు అనుకున్నాను. తేజ చదువు పూర్తయ్వేరకు దగ్గరగా ఉండాలని అన్నమాట’’ అన్నాను.
వౌళి నవ్వాడు. ఆ నవ్వులో పట్టుపడిపోయినట్లు కనిపించాడు.
‘‘నువ్వు ఒక్కదానివే ఈ మాట అన్నావు’’ అన్నాడు.
‘‘అది నిజమే కదా!’’
వౌళి సమాధానం చెప్పలేదు. చెప్పక్కరలేదు కూడా! వాడి చిరునవ్వే చెప్తోంది.
వౌళి ఎంఎస్ పూర్తయ్యేప్పటికి, తేజకి ఇంకా చదువు ఉండిపోయింది. ఆ అమ్మాయితో డేటింగ్ మొదలుపెట్టాడు. అందుకే దగ్గరగా ఉండాలనుకున్నాడు అనుకున్నాను.
మళ్లీ వౌళి చెప్పడం మొదలుపెట్టాడు.
‘‘స్నో స్టార్ట్ అయిన మర్నాడు పొద్దునే్న వెనక్కి బయలుదేరాం. ఉప్పు బాగా వేశారు. కాని, ఎక్కడ చూచినా ఆగిపోయిన కార్స్ చాలా స్లోగా ఉంది. గంటలో ముగియాల్సిన ప్రయాణం 4 గంటలు పట్టింది.
‘‘నన్ను మా స్నేహితుల ఇంట్లో దింపేయండి. మా డాడ్ వచ్చి రైడ్ ఇస్తారు’’ అంది తేజ.
‘‘్ఫరవాలేదు! నేను మీ ఇంటి దగ్గర దింపేస్తాను. ఎలాగూ క్లాసెస్ ఏమీ ఉండవు ఈ స్నోలో. మళ్లీ ఈ వేదర్‌లో మీ ఫాదర్‌ని రమ్మనడం ఎందుకు’’ అన్నాను.
తేజ చాలా మొహమాటపడిపోయింది. ‘‘మీరు, అవుట్ ఆఫ్ వే వచ్చి దింపుతున్నారు’’
‘‘మీరు ఇంకా భయపడటం లేదు కదా నాతో ప్రయాణానికి!’’
నవ్వి ఊరుకుంది.
‘‘ఇన్ని గంటల్లోనూ చాలా కబుర్లే మాట్లాడాము. తేజ ఆరేడు ఏళ్ళు ఇండియాలోనే పెరిగింది. అపుడు వచ్చారుట వాళ్ళ కుటుంబం. ఆ తరువాత చెల్లెళ్ళు ఇద్దరూ అమెరికాలోనే పుట్టారుట. తరచు సమ్మర్‌కి ఇండియా వెళ్ళేవారు. అందుకే ఆ అమ్మాయికి మన దేశం పద్ధతులు బాగానే తెలుసు’’ అన్నాడు వౌళి.
‘‘మేము తేజా ఇంటికి చేరేటప్పటికి వాళ్ళ అమ్మా, నాన్న కంగారుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. రాత్రి తేజ ఫోన్ చేసినా, మళ్లీ ఇంటికొచ్చేవరకూ భయంగానే ఉంది వాళ్ళకు.
తేజా కారు దిగంగానే వాళ్ళ నాన్నగారు గబగబా కోటు కూడా పూర్తిగా వేసుకోకుండానే బయటకు వచ్చేశారు. ఆయన బయటకు రావడం చూచి నేను కారు దిగాను.
ఆయన నా చేతులు పట్టుకు ఊపేస్తూ చాలా చాలా థాంక్స్. ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ యు! అంటూ తెగ పొగిడారు.
‘‘్భలేవారు! ఇటువంటి సందర్భంలో ఈ పని ఎవరైనా చేస్తారు’’ అన్నాను కొంచెం ఇబ్బందిగా ఆయనలో పొంగిపోతున్న కృతజ్ఞత చూస్తూ.
తేజ దిగి తన వస్తువులు తీసుకోగానే ‘‘వస్తాను’’ అంటూ కారులోకి ఎక్కి తలుపు వేసుకోబోయాను.
తేజ అమ్మగారు, ఇంటి తలుపు దగ్గరే నుంచుని ‘‘లోపలకు రమ్మనండి, కాఫీ తీసుకువెళతాడు’’ అంటూ కేక పెట్టింది.
అమెరికా వచ్చాక, అంత గట్టిగా ఓపెన్‌గా తెలుగు మాట్లాడే కపుల్స్‌ని ఇంతకుముందు కలవలేదు. నేను వద్దన్నా, ఆయన తెగ బలవంత పెట్టేసరికి లోపలకు వెళ్ళాను.
నాకు అమెరికా వచ్చాక కొద్దిమంది భారతీయులతో పరిచయం అయినా, వాళ్ళంతా సింగిల్స్, స్టూడెంట్స్, లేక యంగ్ కపుల్స్. ఇలా పూర్తిగా ఎంతోకాలంగా ఇక్కడ ఉండిపోయి, బాగా సెటిల్ అయిన వాళ్ళతో పరిచయం అవలేదు. వీళ్లలా ఇక్కడ కొనే్నళ్లుగా ఉండి, ఇల్లు అది కొనుక్కుని, స్థిరపడినవాళ్ళను కలవలేదు. బంధువులు కూడా ఉన్నారు ఈ దేశంలో.
ఇక్కడకు వచ్చి చాలా కాలమే అయినా, వాళ్ళ ఇల్లు పూర్తిగా మన భారతీయుల ఇల్లల్లే కనిపించింది. ఎదురుగా పెద్ద వెంకటేశ్వర స్వామి ఫొటో, లోపల ఘుమఘుమలాడుతూ వంట వాసనలు, వాటితో.
ఇక ఆ పూట వాళ్ళింట్లో వేడి వేడి ఇడ్లీలు, సాంబారు తింటేగాని నన్ను వెళ్ళనివ్వలేదు.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి