రాష్ట్రీయం

రక్షణ భూములకు ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: రాష్ట్భ్రావృద్ధికి అవసరమైన రక్షణ శాఖ భూములను బదలాయించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సుముఖత వ్యక్తం చేశారని సిఎం కె చంద్రశేఖర్ రావు వెల్లడించారు. సచివాలయ నిర్మాణం, రహదార్ల విస్తరణకు అవసరమైన భూములను బదలాయించేందుకు అవసరమైన ప్రక్రియను స్వయంగా తానే పర్యవేక్షిస్తానని కూడా హామీ ఇచ్చారని చెప్పారు. బుధవారం కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీని విడివిడిగా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల శాసన సభల సీట్లు ప్రస్తుతానికి పెరగటం లేదని కుండబద్దల కొట్టినట్టు చెప్పారు. అందుకు బిజెపి సుముఖంగా లేదన్నారు. రాష్ట్ర సచివాలయం నిర్మాణంతోపాటు హైదరాబాద్‌కు సంబంధించిన పలు రోడ్లు, కరీంనగర్ రహదారి విస్తరణ కోసం రక్షణ శాఖ భూమి కేటాయించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంగీకరించారన్నారు. హైదరాబాదులో త్వరలో జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల ఆర్థిక సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని అంగీకరించారని, ఉమ్మడి హైకోర్టు విభజన పనిని వీలైనంత త్వరగా చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రస్తుతం బీసీ జాబితాలోని ముస్లిం మైనారిటీల రిజర్వేషన్లు పెంచే అంశంపై తదుపరి సమావేశంలో లోతుగా చర్చ జరిపేందుకు మోదీ అంగీకరించారు అని కెసిఆర్ వెల్లడించారు. ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీమేరకు రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల సీట్లు పెంచటం గురించి నరేంద్ర మోదీతో చర్చించినట్టు ఆయన చెప్పారు. సీట్లు పెంపకం పట్ల ప్రభుత్వం సుముఖంగా లేదన్నారు. ఏపీతోపాటు తెలంగాణ శాసన సభ సీట్లు పెరిగితే మంచిదే.
అయితే అవి పెరగకున్నా తమకు ఎలాంటి బాధా లేదని కెసిఆర్ వ్యాఖ్యానించారు. వాస్తవానికి శాసన సభ సీట్లు పెంచాలనేది తమ మొదటి డిమాండ్ కాదు. తామీ అంశాన్ని ప్రధానితో చివరిగా ప్రస్తావించామని అన్నారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కంటే రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం తమకు అత్యంత ముఖ్యమని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల సీట్లు పెంపుపై తాము ఆశించిన స్థాయిలో కేంద్రం సుముఖంగా లేదన్నారు. ‘మీరు చాలాకాలంగా రాస్తున్నదే నిజం కాబోతోంది. మిగతాది మీరే అర్థం చేసుకోండి’ అని సిఎం కెసిఆర్ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఏపీకి పెరిగితే మాకూ పెరుగుతాయి. అయితే అసెంబ్లీ స్థానాలు వెంటనే పెరగాలన్న పట్టుదలతో మేం లేము అని స్పష్టం చేశారు. తెలంగాణ వరకూ అందత ప్రాధాన్యతాంశం కాదన్నారు.
హైదరాబాద్‌కు ప్రధాని
హైదరాబాద్‌లో నవంబర్‌లో జరుగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు హాజరయ్యేందుకు నరేంద్ర మోదీ అంగీకరించారని కెసిఆర్ వెల్లడించారు. ‘అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు తేదీలు ఇంకా ఖరారు కాలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ పర్యటన తేదీలు ఖరారు కాగానే, సదస్సు తేదీలు ప్రకటిస్తాం’ అన్నారు. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు తేదీలు ఖరారు కాగానే ప్రధాని పర్యటన కూడా ఖరారవుతుందని కెసిఆర్ వివరించారు. ప్రపంచ పెట్టుదారుల సదస్సును తెలంగాణ నిర్వహిస్తోందని, ఇందులో అమెరికా చురుకైన పాత్ర నిర్వహిస్తోందని అన్నారు. సదస్సుకు పలు దేశాలు హాజరవుతాయన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు త్వరలోనే ప్రత్యేక హైకోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్టు చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లపైనా ప్రధానితో చర్చించామన్నారు. ప్రస్తుతం బీసీ జాబితాలో ఉన్న ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించటం గురించి తదుపరి సమావేశంలో లోతుగా చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతు సమస్యలు, ఎస్టీల విషయాలూ ప్రధానితో సమావేశంలో చర్చకు వచ్చాయని కెసిఆర్ వివరించారు.
చిత్రం.. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో కెసిఆర్ భేటీ