డిసెంబర్లో అఖిల్ సినిమా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 27 July 2017
అక్కినేని మూడోతరం వారసుడు అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నాగార్జున నిర్మిస్తున్నాడు. అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘అఖిల్’ భారీ పరాజయం పాలవ్వడంతో రెండో సినిమా కోసం చాలా టైమ్ తీసుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీపై రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా గురించి నాగ్ ట్విట్టర్లో స్పందించాడు. అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా డిసెంబర్లో వస్తుందని తెలిపారు. హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంక్లా క్లారిటీ రావాల్సి వుంది. యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుందని సమాచారం.